Geetha Arts: టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఏ వుడ్ అయినా సరే, హిట్ రేషియో చాలా తక్కువే ఉంటుంది. సంవత్సరానికి 200కి పైగా సినిమాలు విడుదలైతే అందులో 20 నుంచి 30 వరకు మాత్రమే హిట్ చిత్రాలుగా నిలుస్తున్నాయి. ఆ 20, 30 చిత్రాలలో చిన్న సినిమా ఉండొచ్చు, పెద్ద సినిమా ఉండొచ్చు. చెప్పలేం.. ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తున్న తరుణంలో ప్రేక్షకులు ఏ చిత్రానికి బ్రహ్మరథం పడతారనే విషయం చెప్పడం చాలా కష్టం.
ఇప్పటి ప్రేక్షకులను మెప్పించాలంటే సాధారణమైన కంటెంట్ ఉంటే సరిపోదు. కంటెంట్, కాన్సెప్ట్, నటన, విజువల్స్, సంగీతం.. ఇలా ప్రతీది ప్రేక్షకుడి కోణంలో బాగుండాలి. అప్పుడే హిట్స్ పడుతున్నాయి. ఇవన్నీ 100 శాతం ఉన్నా, ఒక్కోసారి ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. ప్రేక్షకుల పల్స్ తెలుసుకుని, వారికి కావాల్సిన విధంగా సినిమాను రెడీ చేసి ఇస్తే, కచ్చితంగా హిట్ కొట్టవచ్చు. అలా హిట్స్ కొట్టిన, కొడుతున్న డైరెక్టర్స్‌లో చందూ మొండేటి ఒకరు.
Also Read- Chiranjeevi – Nani: ఆసక్తికర విషయం చెప్పిన నాని.. ఎంతైనా మెగాస్టార్ కదా!
‘కార్తికేయ’ సిరీస్ చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను చాటిన చందూ మొండేటి (Chandoo Mondeti).. రీసెంట్‌గా ‘తండేల్’ (Thandel)తోనూ మంచి సక్సెస్‌ను అందుకున్నారు. ముఖ్యంగా ‘కార్తికేయ 2’ (Karthikeya 2) తర్వాత చందూ మొండేటి స్టార్ దర్శకుడిగా మారిపోయారు. ఆయనని గీతా ఆర్ట్స్ సంస్థ బల్క్‌గా బుక్ చేసుకుందంటే, చందూలో ఉన్న టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘తండేల్’తో భారీ సక్సెస్ అందుకున్న ఈ సంస్థ, ఆ చిత్ర దర్శకుడైన చందూతో మరో మూడు సినిమాల వరకు కాంట్రాక్ట్ రాసేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ విషయం ‘తండేల్’ ప్రమోషన్స్‌లో కూడా నిర్మాత అల్లు అరవింద్ రివీల్ చేశారు.
తమిళ స్టార్ హీరో సూర్యతో తమ బ్యానర్‌లో చందూ మొండేటి ఓ సినిమా చేయబోతున్నాడంటూ అల్లు అరవింద్ అధికారికంగా ప్రకటించారు కూడా. చందూ మొండేటి ‘కార్తికేయ 3’కి వెళ్లే లోపు ఓ సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడని, అది సూర్యతోనే అనేలా టాక్ కూడా వచ్చింది. కాకపోతే సూర్య ఉన్న బిజీకి ఇప్పుడప్పుడే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేదు. దీంతో గీతా ఆర్ట్స్ సంస్థ చందూతో మరొకటి సెట్ చేసినట్లుగా తెలుస్తోంది.
Watch ace producer, the pillar of support for #Thandel, #AlluAravind speech at the #Thandel THANK YOU MEET ❤️🔥
Watch live now!
▶️ https://t.co/4UnxpSS2gSBook your tickets for the DHULLAKOTTESE BLOCKBUSTER now!
🎟️ https://t.co/xtodRI8wA2#BlockbusterLoveTsunami
Yuvasamrat… pic.twitter.com/PuSO2NlTeL— Geetha Arts (@GeethaArts) February 13, 2025
‘తండేల్’ తర్వాత చందూ మొండేటి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ (Ram Pothineni) హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ ఓ సినిమాను సెట్ చేసినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే రామ్‌కు స్టోరీ లైన్‌ని చందూ వినిపించాడని, అది నచ్చడంతో రామ్ ఓకే చెప్పాడనేది తాజా అప్డేట్. ఈ మూవీని గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనుందని, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడించనున్నారనేది వినిపిస్తున్న వార్తలలోని సారాంశం.
ప్రస్తుతం రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు. పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తవ్వగానే రామ్, చందూ మొండేటి ప్రాజెక్ట్ మొదలవుతుందని అనుకుంటున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ఇవి కూడా చదవండి:
Mahesh – Rajamouli: కాశీపట్నం చూడరబాబు.. కాన్సెప్ట్ ఇదేనా! జక్కన్నోయ్.. నీ మైండ్‌కి సలామ్!
Soundarya Husband: హైదరాబాద్‌లోని ఆస్తులపై సౌందర్య భర్త వివరణ.. మోహన్ బాబు సేఫ్!