Dhandoraa: బిందు మాధవి వేశ్యగా.. మూవీ విడుదల ఎప్పుడంటే?
Dhandoraa Release Date (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Dhandoraa: బిందు మాధవి వేశ్యగా నటిస్తున్న మూవీ విడుదల ఎప్పుడంటే?

Dhandoraa: బిందు మాధవి (Bindu Madhavi) చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న తెలుగు మూవీ విడుదల తేదీ ఖరారైంది. నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ, ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించిన లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ (Loukya Entertainments) నిర్మాత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని (Ravindra Benerjee Muppaneni) నిర్మిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’ (Dhandoraa). ముర‌ళీకాంత్ (Murali Kanth) ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉంది. విల‌క్ష‌ణ న‌టుడు శివాజీ (Sivaji) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మ‌స్ స్పెషల్‌గా డిసెంబ‌ర్ 25న విడుదల చేయబోతున్నట్లుగా మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ విషయం తెలుపుతూ.. అధికారికంగా ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్‌ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. ఓ ఖాళీ ప్రాంతంలో త‌వ్విన గొయ్యిని చూపిస్తూ.. ‘ఈ ఏడాదికి డ్రామ‌టిక్‌గా ముగింపునిస్తున్నాం’ అనే క్యాప్ష‌న్‌తో ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.

Also Read- Shiva Re Release: జెన్-జి‌ని మెప్పించే కంటెంట్‌ ‘శివ’లో ఏముంది? ఎందుకు ఈ సినిమా చూడాలి?

వేశ్య పాత్రలో బిందు మాధవి

ఇందులో బిందు మాధవి వేశ్యగా నటిస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చేశాయి. ఇందులో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ బిజీ నటిగా మారుతుందని చిత్రబృందం తెలుపుతోంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన వెర్స‌టైల్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌.. ‘దండోరా’పై అంచనాలు ఏర్పడే చేయగా.. ఈ సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేసింది. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలు ప్రేమించి, పెళ్లి చేసుకున్నా, ఈ విషయంలో తన సొంతవారిని ఎదిరించినా.. ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతుందనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ తెలిపి ఉన్నారు.

Also Read- Telugu Reality Shows Impact: తెలుగు రియాలిటీ షోల వల్ల ఎంటర్‌టైన్మెంట్ తప్పుదారి పడుతుందా?.. అసలు వాటి వల్ల లాభమా?.. నష్టమా?

చివరి దశ చిత్రీకరణలో..

తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో మ‌న పురాత‌న ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూనే.. వ్యంగ్యం, చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమా ఉంటుందని నిర్మాత ఈ అప్డేట్‌లోని తెలియజేశారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని, మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతుందని, అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని తెలిపారు. శివాజీతో పాటు నవదీప్, నందు, బిందు మాధవి, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె. రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వెంక‌ట్ ఆర్‌. శాఖ‌మూరి సినిమాటోగ్ర‌ఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్‌, క్రాంతి ప్రియ‌మ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. త్వరలోనే ప్రమోషన్స్‌పై కూడా టీమ్ దృష్టి పెట్టనుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Eesha Movie: యుఎస్‌లో రిలీజ్ కాకుండానే ఫేక్ రివ్యూ.. నిర్మాతకు దొరికేసిన రివ్యూయర్!

Duvvada Couple: శివాజీ మాటల రచ్చలోకి ‘దువ్వాడ’ జంట.. సపోర్ట్ ఎవరికంటే?

Vilaya Thandavam: యాక్షన్ మోడ్‌లో కార్తీక్ రాజు.. ‘విలయ తాండవం’ లుక్ అదిరింది

Suryapet News: పిల్లర్లు తడుపుతూ కరెంట్ షాక్‌తో తండ్రీకొడుకు మృత్యువాత.. తీవ్ర విషాదం

Jetlee Movie: వెన్నెల కిషోర్ ‘సుడోకు’ ఫన్.. ‘జెట్లీ’ స్టైలిష్ ఫస్ట్ లుక్ విడుదల