Naari Movie Poster
ఎంటర్‌టైన్మెంట్

Bumper Offer: ఈ సినిమాకు ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ!

Bumper Offer: ఈ మధ్య చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎటువంటి హీరోల సినిమాలైనా సరే, కంటెంట్ ఉంటే తప్పితే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి మేకర్స్ బాగానే కష్టపడుతున్నారు. ప్రమోషన్స్‌లో వెరియేషన్స్‌తో దూసుకెళుతున్నారు. విడుదలకు ముందు సినిమాపై వచ్చే క్రేజ్, విడుదల తర్వాత సినిమాపై వచ్చే టాక్.. ప్రస్తుతం ఎంతో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడొక సినిమా టీమ్ వైవిధ్యంగా ప్రేక్షకులలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటి? ఏమటా వైవిధ్యత అని అనుకుంటున్నారా? సినిమా పేరు ‘నారి’. మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ సినిమాకు మేకర్స్ ఇప్పుడో బంపర్ ఆఫర్ ప్రకటించారు.

Also Read- Chhaava Telugu Trailer: గర్జనకు లొంగకపోతే పంజా వేట తప్పదు

ఆమని (Aamani), వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నారి’ (Naari Movie). మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలను అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి, ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 13 నుండి 20 ఏళ్ల మధ్య పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే విషయాన్ని చెబుతూ దర్శకుడు సూర్య వంటిపల్లి తెరకెక్కించారు. నిర్మాత శశి వంటిపల్లి ఈ సినిమాను నిర్మించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న విడుదలవుతున్న ఈ చిత్రానికి మార్చి 7, 8 తేదీలలో వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు. ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అన్నమాట. ‘నారి’ అంటేనే మహిళ. అందుకే ఈ మహిళా దినోత్సవానికి టీమ్ ఇలా ప్లాన్ చేసింది. దీంతో, ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Naari Movie Poster
Naari Movie Poster

ఈ ఆఫర్ అనే కాకుండా.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి స్పందననే రాబట్టుకుంది. సింగర్ సునీత (Singer Sunitha) పాడిన ‘హవాయి హవాయి’ సాంగ్, ఇటీవల రమణ గోగుల (Ramana Gogula) పాడిన ‘గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే’ సాంగ్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. స్కూల్ గర్ల్ నిత్యశ్రీ వీడియో కూడా సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు కపుల్స్ కోసం 7వ తేదీ, 8వ తేదీ అన్ని షోస్‌కు టికెట్స్ పై వన్ ఫ్లస్ వన్ ఆఫర్ ప్రకటించి మరోసారి ఈ సినిమా వార్తలలో హైలెట్ అవుతోంది. ఈ సినిమా టికెట్స్‌ను సమీపంలోని థియేటర్లలో ఇంకా బుక్ మై షో ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని ఈ సందర్భంగా టీమ్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:
Rashmika Mandanna: రష్మికా మందన్నాపై ఎమ్మెల్యే ఫైర్.. గుణపాఠం చెబుతాం!

Actress: ఏకంగా ఐదుగురు స్టార్ హీరోలతో హీరోయిన్ ఎఫైర్?

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..