lobo ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Anchor Lobo: బ్రేకింగ్.. యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష?

Anchor Lobo: యాంకర్ లోబో గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యాడు. యాంకర్ లోబో పూర్తి , పేరు మొహమ్మద్ ఖయ్యిం. ఇతను తెలుగు టెలివిజన్ రంగంలో ప్రముఖ యాంకర్‌గా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అతని సినీ కెరీర్‌లో యాంకరింగ్‌తో పాటు పలు సినిమాల్లో కూడా నటించాడు. అయితే, ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా తాజాగా జరిగిన ఘటనతో మళ్లీ వార్తల్లో నిలిచాడు. యాంకర్ లోబో కు జనగామ కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 12,500 జరిమానా విధించారు. అసలేం జరిగిందంటే?

జనగామ జిల్లా నిడిగొండ వద్ద ఆటోను ఢీ కొట్టాడు. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరూ మరణించారు. కారు కూడా బోల్తా పడటంతో లోబోతో పాటు కారులో ఉన్న వాళ్ళకి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేయగా .. గురువారం కోర్టు తీర్పు నిచ్చింది.

Also Read: Teachers Protest: మా సమస్య ప్రభుత్వానికి చెప్పు.. పట్టించుకునేలా చెయ్.. గణపయ్యకు వినతి పత్రం

యాంకరింగ్ కెరీర్:

మా టీవీ: లోబో తన కెరీర్‌ను స్టార్ మా ఛానల్‌లోని “మా మ్యూజిక్” షోలో యాంకర్‌గా మొదలు పెట్టారు. అతని ప్రత్యేకమైన యాంకరింగ్ శైలి, హాస్యం, ఆకర్షణీయమైన మాటలతో అందర్ని ఆకట్టుకున్నారు.

బిగ్ బాస్ తెలుగు: ఇతకున్న క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొన్నారు. ఆ షో లో ఎంటర్టైనర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. అతని గుర్తింపును మరింత పెంచింది. ఈ షో ద్వారా అతను ఎక్కువ పాపులారిటీ సంపాదించారు.

Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు జలమయమైన రోడ్లు.. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు చేయవద్దు

ఢీ 20: లోబో ఈ టీవీ షోలో కూడా సందడీ చేశారు. ఇది అతని టెలివిజన్ ఉనికిని మరింత బలపరిచింది.

సినిమా కెరీర్:

ఆర్య 2: అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన “ఆర్య 2″లో లోబో ఒక చిన్న పాత్రలో నటించారు. ఇది ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే అతను ఏ సన్నివేశంలో కనిపించాడని ప్రేక్షకులు వెతుకుతున్నారు. లోబో సినిమా రంగంలో పెద్దగా దృష్టి సారించలేదు, కానీ అతని యాంకరింగ్ ద్వారా సంపాదించిన గుర్తింపు సినీ ఇండస్ట్రీలో కొన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది.

Also Read: Tummala Nageswara RaoL: ప్రభుత్వ ఉద్యోగులపై మంత్రి తుమ్మల గరం గరం.. చర్యలు తప్పవని హెచ్చరిక..?

లోబో తన కామెడీ, సరదా స్వభావంతో టీవీ షోలలో ఎక్కువగా పాపులర్ ఉంటాడు. అతని ఇంటర్వ్యూలు, ముఖ్యంగా యాంకర్ శివతో జరిగిన సంభాషణలు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. 2018లో లోబో జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయితే, పెద్ద ప్రమాదం జరగలేదు, అతను తొందరగానే కోలుకున్నాడు. ఇప్పుడు, తాజాగా ఈ కేసులో లోబో జైలుకు వెళ్లనున్నాడు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్