Bigg Boss 9 Telugu Promo: బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఈ షో, ఇప్పుడు తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)తో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సీజన్ గ్రాండ్ లాంఛ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఉహకందని మార్పులు.. ఊహించని మలుపులు డబుల్ హౌస్ తో డబుల్ జోష్ తో మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 9. కామన్ పీపుల్స్ కి ఇది కల లాగా ఉంది. కలయా .. నిజమా అంటూ ఒక కంటెస్టెంట్ అంటే.. ఒక సారి పక్కన ఉన్న వాళ్ళు ఆమెను గిచ్చండి అంటూ నాగ్ రివర్స్ పంచ్ వేసి అక్కడున్న వాళ్ళందర్ని నవ్వించాడు.
Also Read: Bigg Boss Telugu 9: ఈ రోజే బిగ్ బాస్ 9 గ్రాండ్ లాంఛ్.. ఫైనల్ లిస్ట్ అదేనా లేక అంతా తూచ్ అంటారా?
ఆశ ఒక పక్కా.. ఆశయం ఒక పక్కా మరి ఈ రణరంగం చూడటానికి సిద్ధమా మీరు? ఇప్పటి వరకు నాలో యుద్ధ భూమిలో శంఖం పూరించే కృష్ణుడిని చూశారు. ఈ సీజన్లో రంగంలోకి దిగే అర్జునుడిని చూస్తారని బిగ్ బాస్ బేస్ వాయిస్ తో చెప్పాడు. ఎన్నడూ లేనిది బిగ్ బాస్ ఇలా చెప్పడంతో బుల్లి తెర ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు.
సెకండ్ హౌస్ అవుట్ స్టాండింగ్ లాగా ఉందని నాగ్ ఫుల్ జోష్ లో చెప్పాడు. ప్రోమో లో హైలెట్ ఏంటంటే.. ఓ కంటెస్టెంట్ హౌస్ లోకి ఓ బాక్స్ తీసుకెళ్తా .. పర్మిషన్ ఇవ్వండి బిగ్ బాస్ అడగగా.. ఇంట్లోకి ఏవి తీసుకెళ్లడానికి వీల్లేదు అన్నాడు. అయితే, నేను వెనక్కి వెళ్ళిపోతా.. అని ఆ కంటెస్టెంట్ అన్నాడు. ఇక అది మీ ఇష్టం అని బిగ్ బాస్ అనగా.. నాగ్ కూడా మీరు వెళ్లిపోవచ్చు అన్నాడు. మరి, అతను ఎవరో తెలుసుకోవాలనుకుంటే.. రాత్రి వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. మార్పు సరిపోయిందా నాగార్జున.. అని బిగ్ బాస్ అడగగా.. సరిపోయింది బిగ్ బాస్. మీ తీరు మారింది. ఇల్లు మారింది. ఒక్క ఇల్లు అయితే ఆట చదరంగం అయ్యేది. రెండో ఇల్లుతో రణ రంగం అయింది. ముందుంది ముసళ్ళ పండగ అనే డైలాగ్ తో ప్రోమో కి హైప్ ఇచ్చారు.