Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?
Pawan and Arjun Das
ఎంటర్‌టైన్‌మెంట్

Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?

Arjun Das: నటుడు అర్జున్ దాస్ తాజాగా తన సోషల్ మీడియా పోస్ట్‌లో ‘ఓజీ’ (OG) చిత్రం విడుదలకు ముందు తన ఆనందాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో.. ‘‘ఓజీ సినిమా మీ అందరి ముందుకు కొన్ని గంటల్లో చేరనుంది. నేను ఈ చిత్రంలో చిన్న పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదు, కానీ ఇది ఇంగ్లీష్, తెలుగులో వ్యక్తం చేయాలనుకుంటున్నాను. నన్ను తెలుగు ప్రేక్షకులు, మీడియా ఎంతగానో అక్కున చేర్చుకున్నారు, దానికి నేను అర్హుడినో కాదో తెలియదు. నేను చెప్పాలనుకున్నది, నీ ప్రేమకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడినను’’ అని పేర్కొన్నారు.

Also Read- Reba Monica John: ‘కూలీ’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు.. అప్పుడలా, ఇప్పుడిలా అంటూ నెటిజన్లు ఫైర్!

ఒక్క సందేశం పంపితే చాలు

ఇంకా ఆయన ఈ చిత్రం ద్వారా అతనికి ఒక అద్భుతమైన స్నేహితుడు లభించాడని, సంతోషమైన ఫిల్మ్‌మేకర్, పీకే సార్ పట్ల ఎంతో ప్రేమతో పని చేస్తాడని అర్జున్ పేర్కొన్నాడు. సుజీత్ భాయ్‌ విజన్‌ను పంచుకున్నందుకు కృతజ్ఞతలని, నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే.. నీవు ఏ సినిమా డైరెక్ట్ చేసినా నీవు గెలవాలని, అందులో తన కోసం పాత్ర ఉంటే ఒక్క సందేశం పంపితే చాలని, కథతో కూడా అవసరం లేకుండా సినిమా చేస్తానని అర్జున్ దాస్ మాటిచ్చారు. ఇంకా థమన్‌కు, నిర్మాత డీవీవీ దానయ్య, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, మనోజ్, రవిచంద్రన్, సహాయ దర్శకులు, డబ్బింగ్ దుర్గా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులను మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉందని, రెండు సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్లినా, ఓజీ అప్డేట్ అంటూ వాళ్లు నన్ను ఎంతో ప్రేమగా పలకరించేవారని చెప్పుకొచ్చారు.

Also Read- Ghaati OTT: స్వీటీ ‘ఘాటి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంకొన్ని గంటల్లోనే!

రియల్ లైఫ్‌లో కూడా అంతే స్టైలిష్

ఇక పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ.. ‘‘నాకు చాలా గర్వంగా ఉంది, మీరు నాతో మొదటి సమయంలో మాట్లాడినప్పుడు, నా ఇంటర్వ్యూలు చూశా అన్నారు. నేను నా తల్లిదండ్రులకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ సర్ నన్ను తెలుసుకున్నారని, నా పేరు కూడా తెలుసు అని చెప్పాను. షూట్ మొత్తం రెండు గంటలు మాట్లాడుతూ గడిపాం, నేను ఆ సంభాషణలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. మీరు Good Bad Ugly చూశానని, నన్ను జమ్మీ అని పిలిచినప్పుడు నేను ఎలా స్పందించాలో తెలియలేదు, కానీ ధన్యవాదాలు సర్, అది నాకు చాలా ముఖ్యం. మిమ్మల్ని పవర్‌స్టార్ అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు స్క్రీన్‌పై స్టైలిష్‌గా ఉంటారు. కానీ రియల్ లైఫ్‌లో కూడా అంతే స్టైలిష్. మీరు ఎంత బిజీ గా ఉన్నా, నాతో మాట్లాడేందుకు సమయం తీసుకున్నారు, నా లాంటి గ్రోయింగ్ యాక్టర్‌కు ఇది చాలా ముఖ్యం. మీకోసం కొందరు వేచి ఉన్నా కూడా.. నాతో పూర్తి శ్రద్ధతో మాట్లాడారు. షూట్‌లో షర్ట్‌పై రక్తం ఉన్నా, నేను ఫోటో తీసుకోవాలని అనుకున్నాను కాబట్టి మార్చారు, ఇది మీ గుణాలను తెలియజేస్తుంది. హరి హర వీరమల్లు వాయిస్‌ ఓవర్ చేసినప్పుడు ట్వీట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు చేశారు. పవన్ సర్ నిజాయితీగా ప్రవర్తిస్తారు. నేను మీకు, లోకేష్ సార్‌కి చెప్పేది ఒక్కటే. మీకు నాతో ఏ అవసరం ఉన్నా ఒక్క కాల్ దూరమే అని మరిచిపోకండి’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ugandhar Muni: ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా.. ‘శంబాల’ కథ రాశా!

Mana Shankara Varaprasad Garu: పూనకాలు లోడింగ్.. ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ డేట్ ఫిక్స్!

Jwala Gutta: శివాజీ వివాదంపై గుత్తా జ్వాల ఘాటు వ్యాఖ్యలు.. పోస్ట్ వైరల్!

Indian Railways: రైల్వేస్ కీలక నిర్ణయం… ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్!

Chamala Kiran Kumar Reddy: దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా.. ఎంపీ చామల కేటీఆర్‌కు సవాల్!