Anushka Shetty ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Ghaati Movie Review: ‘ఘాటి’ జెన్యూన్ సినిమా రివ్యూ.. అనుష్క హిట్ కొట్టినట్టేనా?

Ghaati Movie Review: చాలా కాలం గ్యాప్ తీసుకుని, అనుష్క సరి కొత్త కథతో మన ముందుకొచ్చింది. అరుంధతి, భాగమతి సినిమాల్లో పవర్ఫుల్ పాత్రల్లో నటించి మాస్ ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఇక ఇప్పుడు కొత్త ప్రయోగాగానికి సిద్దమయ్యి ఆడియెన్స్ ముందుకొచ్చింది. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ‘ఘాటి’. యాక్షన్ క్రైమ్ డ్రామా, యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 5, 2025న ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అయింది.

కథ

ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని అరకు ప్రాంతంలో, గంజాయి మాఫియా నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అడవిలో నివసించే కొంతమంది గంజాయి పంటలు పండించి జీవనం సాగిస్తారు. అనుష్క శీలావతి పాత్రలో గిరిజన మహిళగా కనిపిస్తూ, సమాజంలో గంజాయి వల్ల జరిగే అనర్థాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎదుర్కొనే సవాళ్లు, యాక్షన్ సన్నివేశాలు కథను ముందుకు నడిపిస్తాయి.

Also Read: Upasana Konidela: సాయిబాబా వ్రతం పూర్తి చేసిన ఉపాసన, చివరి రోజు ఆమె చేసిన పనికి అంతా ఫిదా!

విశ్లేషణ

నటన: అనుష్క శెట్టి శీలావతి పాత్రలో అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఆమె యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాల్లో నట విశ్వరూపం కనిపించింది. ఆమె స్టార్‌డమ్, గ్రేస్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విక్రమ్ ప్రభు ఇంటెన్స్ పాత్రలో మెప్పించాడనే చెప్పుకోవాలి. రాజసుందరం మాస్టర్ ఒక సర్‌ప్రైజింగ్ క్యారెక్టర్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు.

దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి ఈ మూవీలో ఎమోషన్, యాక్షన్‌ను బ్యాలెన్స్ చేసి, సమాజంలో గంజాయి సమస్యను చూపించే ప్రయత్నం చేశాడు. అయితే, క్రిష్ గత చిత్రాల కంటే మంచి స్థాయిని అందుకోలేదని చెప్పుకోవాలి.

Also Read:  Hyderabad: ట్యాంక్ బండ్ వద్ద గణనాథుల జోరు.. ఇప్పటికే లక్షన్నరకు పైగా విగ్రహాల నిమజ్జనాలు

సాంకేతిక అంశాలు: మనోజ్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలిచింది. విద్యాసాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలం అయినప్పటికీ, సంగీతం, బీజీఎమ్ కొంత డల్‌గా అనిపించింది.

ప్లస్ పాయింట్స్

అనుష్క శెట్టి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్
యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ సీన్స్
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నేపథ్యం, విజువల్స్

Also Read:  Teacher Award Controversy: ఉత్తమ టీచర్ అవార్డుల్లో నిబంధనలకు తూట్లు.. విరుద్ధంగా అవార్డులు

మైనస్ పాయింట్స్

సంగీతం, బీజీఎమ్ నిరాశపరిచాయనే చెప్పుకోవాలి.
కొన్ని సీన్స్ సాగదీతగా అనిపించడం
కథనం కొంతమందికి గందరగోళంగా అనిపించడం

ఒక్క మాటలో చెప్పాలంటే.. అనుష్క ఫ్యాన్స్, యాక్షన్ డ్రామా ప్రియులు థియేటర్‌లో చూడవచ్చు.

రేటింగ్ : 2/5

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం