Saturday, May 18, 2024

Exclusive

కన్నబిడ్డ మృతదేహాన్ని చేతుల్లో మోసుకెళ్లిన తండ్రి.. ఇదేనా రాజన్న పాలనా?

కన్నబిడ్డ మృతదేహాన్ని తండ్రి 8 కిలోమీటర్లు చేతుల్లో మోసుకెళ్లిన ఘటన ఏపీలో కలకలం రేపుతున్నది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ బాలుడు ఈ నెల 8న మరణించాడు. స్వగ్రామానికి అంబులెన్స్‌లో బయల్దేరారు. మృతుడి స్వస్థలం అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ పరిధిలో ఉన్నది. కానీ, అంబులెన్స్ దారి సరిగా లేదని వదిలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో కొత్తయ్య తన కొడుకు డెడ్ బాడీని చేతుల్లో పట్టుకుని కొండ పైకి నడుచుకుంటూ వెళ్లాడు.

ఈ ఘటన పై స్థానిక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో అభివృద్ధి జరుగుతున్నా.. తమకు కనీసం సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై ఆక్రోశించారు. కొత్తయ్య తన కొడుకు మృతదేహాన్ని మోసుకెళ్లుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటనపై ఏపీ విపక్ష పార్టీలు స్పందించాయి. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి.

Also Read: ఆలు లేదు.. చూలు లేదు..! టికెట్ లేకున్నా క్యాంపెయిన్ కోసం కసరత్తు!

అంబులెన్స్ వనిజ వద్ద దారి మధ్యలోనే కొత్తయ్యను వదిలిపెట్టి పోయిందని టీడీపీ పేర్కొంది. ఈశ్వరరావు మృతదేహాన్ని తండ్రి 8 కిలోమీటర్లు మోసుకెళ్లిన హృదయవిదారక దృశ్యాలు బాధాకరంగా ఉన్నాయని తెలిపింది. వైసీపీ ప్రభుత్వం ఫీడర్ అంబులెన్స్‌లను మూలన పడేసి బాధ్యతారాహిత్యంగా, మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నదని ఆరోపించింది. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయని ఫైర్ అయింది.

కాగా, వైఎస్ షర్మిల కూడా అన్న జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ ఇంటికి, మీ గ్రామానికి మేలు చేస్తేనే ఓటు వేయండని అడిగేవాళ్లకు ఇది చూసైనా కనువిప్పు కలగాలి’ అని ఆగ్రహించారు. ఆరోగ్య శ్రీని అటకెక్కించారని, సరైన వైద్యం ఎలాగూ అందటం లేదని, కనీసం చనిపోయాక డెడ్ బాడీని కూడా ఇంటికి చేర్చకోలేని దురవస్థలో ప్రజలు ఉన్నారని, ఇది అధికార పార్టీకి సిగ్గుచేటని విమర్శించారు. పేదోడి కనీస అవసరాలు తీర్చలేని ఈ ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇంకా రాజన్న వారసులం అని చెప్పుకుంటారని మండిపడ్డారు. రాజన్న పాలన ఇలానే ఉంటుందా? అని నిలదీశారు.

Publisher : Swetcha Daily

Latest

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్...

Vijayashanthi: కిషన్ రెడ్డిపై విజయశాంతి ట్వీట్ వైరల్.. రాములమ్మ ఏం చెప్పాలనుకున్నారు?

Telangana: విజయశాంతి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది....

Don't miss

Hyderabad:హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్

ల్యాండ్ వివాదంలో హైకోర్టును ఆశ్రయించిన తారక్ 2003లో గీత లక్ష్మీ నుండి ప్లాట్ కొనుక్కున్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్లాట్ పై బ్యాంకులకు హక్కులున్నాయన్న డీఆర్టీ డీఆర్ఠీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరిన...

AP accident: ఓట్లేయడానికి వెళ్లి..సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ చిలకలూరి పేట మండలం ఈవూరి పాలెంలో ఇద్దరు డ్రైవర్లతో సహా నలుగురు సజీవదహనం పలువురికి తీవ్ర గాయాలు ...

Liquor Scam: కవిత కస్టడీ కంటిన్యూ!

- మరోసారి కవిత కస్టడీ పొడిగింపు - ఇప్పటికే సీబీఐ కేసులో ఈనెల 20 వరకు పొడిగించిన కోర్టు - ఈడీ కేసులోనూ అదే రోజుకు కంటిన్యూ - 14 రోజులు పొడిగించాలన్న ఈడీ...