Crime-News
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Viral News: ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్.. భర్త చెవులు కోసేసిన భార్య

Viral News: మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన (Viral News) జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి కట్టుకున్న భర్తపై ఓ భార్య దాడి చేసింది. ఇందుకు ప్రియుడితో కలిసి పక్కా ప్లానింగ్ వేసింది. మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాకు చెందిన ఓ వివాహితతో గంగారం మండలం మర్రిగూడేనికి చెందిన అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి ప్లాన్ ప్రకారం సదరు భర్త చెవులు కోశారు. దీంతో, బాధితుడు తల్లడిల్లిపోయాడు. భయంతో అరుస్తూ బయటకు పరుగు తీశాడు. దీంతో, స్థానికులు విషయాన్ని గుర్తించారు. బయటకు పారిపోయేందుకు ప్రయత్నించిన ప్రియుడిని స్థానికులు పట్టుకున్నారు. అందరూ కలిసి దేహశుద్ధి చేశారు.

Read also- Handshake Controversy: ‘నో షేక్‌హ్యాండ్’ పరాభవం నుంచి బయటపడని పాక్.. కీలక అధికారిపై పీసీబీ వేటు

ఆందోళన కలిగిస్తున్న ఘటనలు

వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా, అడ్డుగా ఉంటున్నాడంటూ కట్టుకున్న భర్తలపైనే ప్రియుళ్లతో కలిసి దాడులు చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయి. ఈ కొత్త ధోరణి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ తరహా ఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇవి కేవలం వ్యక్తిగత సమస్యలు కాదని, సమాజంలో విస్తరిస్తున్న నైతిక విలువల పతనం, సంబంధాల్లో నమ్మకాలు సడలిపోవడాన్ని సూచిస్తున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రియుళ్లతో కలిసి భార్యలు దాడులు చేస్తున్న ఘటనల్లో బాధిత భర్తలు శారీరకంగా గాయపడడమే కాకుండా, మానసికంగా కూడా తీవ్రంగా దెబ్బతింటున్నారు. ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు కూడా చాలానే జరుగుతున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ కారణంగానే ఇలాంటి విపరీతాలు జరుగుతున్నాయనే వాదనలు ఉన్నాయి. సమాజం దీనిపై మేల్కోవాల్సిన అవసరం ఉందనే సూచనలు వినిపిస్తున్నాయి.

Read Also- KTR: జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Just In

01

Karnataka 1: ‘కాంతారా ఛాప్టర్ – 1’కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏపీ డిప్యూటీ సీఎం స్పందన

Election Code: తనిఖీలు షురూ… అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. రూల్స్ ఇవే

Investment Fraud: భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించి.. నిండా ముంచారు!

OTT Movie: ఒంటరితనానికి గురైన చిన్నారి.. ఆ రహస్యం కోసం ఏం చేశాడంటే?

OTT Movie: విడిపోయిన ప్రేమ జంట అనూహ్యంగా అలా పట్టుబడితే.. ఏం చేశారంటే?