Guntur Tragedy: విజయనగరం జిల్లా శివరాంలో అఖిలపై కత్తితో దాడి చేసిన ఆదినారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు స్పృహలోకి వచ్చి వివరాలు చెప్పడంతో ఆదినారాయణ (21)ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘ అఖిల సోదరుడికి ఆది స్నేహితుడు. యువతి కుటుంబ సభ్యులతోనూ ఆదినారాయణ సన్నిహితంగా ఉండేవాడు. ఇటీవల ఆమెకు నిందితుడు అసభ్య సందేశాలు పంపాడు.
ఈ క్రమంలో వారిద్దరికీ వాగ్వాదం జరిగింది. దీంతో అఖిల కుటుంబసభ్యులు అతడిని హెచ్చరించారు. కక్ష పెంచుకుని ఆదినారాయణ దాడి చేశాడు. యువతి ఇంటి పనులు చేస్తుండగా నిందితుడు ఈ ఘటన జరిగింది. సెక్సువల్ జలసీతోనే కత్తితో దాడి చేసినట్లు ఆదినారాయణ అంగీకరించాడు. హత్య అనంతం మాస్క్ పడేసి టీ షర్ట్ మార్చుకొని గ్రామస్తులతో కలిసిపోయాడు. అందరిలాగే అగంతకుడిని వెతుకుతున్నట్టు నటించాడు. దాడి అనంతరం కత్తిని తన డ్రాయర్‌లో పెట్టుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
Also read: CM Chandrababu: తమ్ముళ్లకు ఏమైంది?.. టైమ్ చూసి సీఎం చెక్ పెట్టబోతున్నారా!
యువతి అఖిల ఇచ్చిన సమాచారంతో ఆదినారాయణను అదుపులోకి తీసుకొని విచారించాం. 24 గంటల్లోగా నిందితుడిని అరెస్టు చేశాం. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నాం ’ అని ఎస్పీ వివరించారు. మరోవైపు నిందితుడు ఆది, అతని మిత్రులు కలిసి ఈ ఘటనకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.