Crime News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా సుజాతా నగర్‌లో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తనకు ఐఫోన్ కొనివ్వలేదన్న మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు, అక్కడి స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఇక వివరాల్లోకి వెలితే.. విశాణ పట్నం జిల్లా సుజాత నగర్‌కు చెందిన సాయి మారుతి కెవిన్(Sai Maruti Kevin) (26) అనే యువకుడు కొన్ని రోజుల పాటు హైదరాబాద్(Hyderabad) లోని సినీ పరిశ్రమలో పని చేశాడు. అయితే అక్కడ యువకుడికి అవకాశాలు తగ్గడంతో ఇటీవలే హైదరాబాద్ నుండి తన స్వంత గ్రామానికి తిరిగి వచ్చాడు.
తండ్రి ఆర్థిక పరిస్థితులు..
ఇక కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని నిర్నయించుకున్నాడు. కొన్ని రోజుల తరువాత ఈ మధ్యకాలంలో తనకు ఖరీదైన ఐఫోన్(I Phone) కావాలని తన తండ్రిని పదేపదే అడుగుతున్నాడు. కొన్నిరోజులుగా ఐఫోన్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య కొన్ని సార్లు వాగ్వాదం జరిగేదని అక్కడి స్థానికులు కూడా చెబుతున్నారు. తండ్రి ఆర్థిక పరిస్థితులు బాగా ఉండేవి కావు. అందుకు కుటుంబ అవసరాలు తీర్చేవరకే అతడి సంపాదన సరిపోయేది. ఈ క్రమంలో తను కమారుడికి ఐఫోన్ కొనియ్యలేక పోయాడు అతని తండ్రి. ఎన్నిసార్లు అడిగిన సాయి తండ్రి సెల్ ఫోన్ కొనియ్యక పోవడంతో సాయి మారుతి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దాన్ని మనసులో పెట్టుకున్న సాయి ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో మరోసారి గోడవ పెట్టుకున్నాడు. అనంతరం తన గదిలోకి వెళ్లిపోయాడు. కొంతసేపటి తరువాత తను బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యలు తలుపు తట్టారు.
Also Read: KTR: యువత ఆకాంక్షలను ప్రభుత్వం విస్మరించొద్దు: కేటీఆర్
గదిలోకి వెల్లి చూడగా..
ఎంత పిలిచిన తను స్పందించక పోవడంతో తలుపులు విరగోట్టి లోపలికి వెల్లారు. గదిలోకి వెల్లి చూడగా సాయి మారుతి ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించాడు. షాక్క కిగురైన అతని కుటుంబ సబ్యలు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే అతడు చనిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద సంఘటనతో అక్కడి పరిసర ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై వాపోయారు. తన కొడుకు అడిగిన చిన్న కోరికను నెరవేరలేదన్న కారణంతో తను ప్రాణాలు తీసుకోవడం తట్టుకోలేకపోతున్నాం అంటూ తల్లిదండ్రులు గోడును విలపిస్తున్నారు. అక్కడి స్ధానికులు సైతం కేవలం ఐఫోన్ కోసం ప్రాణం తీసుకోవడం ఎంత దారుణమని అంటూ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గటనతో అక్కడి ప్రాంత మంతా విషాద చాయలు అలుముకున్నాయి.
Also Read: Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!
ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్
విశాఖ జిల్లా సుజాతనగర్లో తండ్రి ఐఫోన్ కొనివ్వలేదని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిన సాయి మారుతి కెవిన్ (26)
కొంతకాలం హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమలో పని చేసి ఇటీవలే ఇంటికి వచ్చిన సాయి మారుతి
ఐఫోన్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం
ఈ క్రమంలో… pic.twitter.com/coxsCglWbA
— BIG TV Breaking News (@bigtvtelugu) September 22, 2025