Vishaka Murder: విశాఖ పట్నం భీమిలీ పోలీసు స్టేషన్ పరిధిలో దాకమర్రి ఫార్చ్యున్ లే ఔట్ లో ఒ మహిళ దారుణమైన హత్యకు గురైంది. ఆమే ఒంటిపై పెట్రోల్ పోసి దారుణంగా హతమార్చిన ఘటన వెలుగు లోకి వచ్చింది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన ప్రదేశమును పరిశీలించారు.
చనిపోయిన మహిళ వివాహిత వయస్సు 25 సంవత్సరాలుగా ఉంటుందని పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి వెళ్లిన ఎసీపీ కేసు నమొదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్యుడిని ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన విశాఖలో జరిగింది.
ఇలా ఆ సంఘటన మరువక ముందే ఈ మహిళను చంపిన విషయం తెలియటంతో ఇలా వరుస హత్యలు జరుగడంతో ప్రజలు భయాందోళనకు గురవు తున్నారు.
Also Read: Home Guard Suspended: మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు.. హోంగార్డు బలి!