Home Guard Suspended: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌ను ఏసీబీఅధికారులు తనిఖీ చేశారు. కేసు తొలగింపునకు లంచం డిమాండ్ చేసినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు ఎసిబిఅధికారుల ఆధ్వర్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఘటనలో పోలీస్ హోంగార్డు సంతోష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు . ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఫిర్యాద దారుడు అమీర్ వ్యక్తిగత పనుల నిమిత్తం దుబ్బాక మున్సిపాలిటీ పరిధి లచ్చపేట నుంచి మిరుదొడ్డి మీదుగా హైదరాబాద్ కు వెళుతున్న క్రమంలో మిరుదొడ్డి శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి స్థానికుడైన రాజు వాహనాన్ని ఢీకొట్టింది.
దీంతో అదే రోజు రాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే క్రమంలో హోంగార్డు సంతోష్ ఫిర్యాదుదారుడు – రాజు పరస్పర సమ్మతితో వ్యవహారం సర్దుబాటు చేస్తానన్నారు. ఇందుకుగాను రూ.15వేలు లంచం ఇవ్వాలని హోంగార్డు సంతోష్ గౌడ్ ఫిర్యాదారుడు ని డిమాండ్ చేశారు. రూ. 10 వేలకు కు ఒప్పందం కుదుర్చుకున్నారు. లంచం అడగడం దానిపై అసంతృప్తి చెందిన అమీర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఒప్పంద ప్రక్రియలో హోంగార్డు సంతోష్ రూ.2 వేలు స్వీకరించారు. మిగతా రూ.8 వేలలో పరోక్షంగా ముట్టజెప్పాలని సూచించారు. అందులో గ్రామానికి చెందిన హోటల్ నిర్వాహకుడీకి రూ.2 వేలు, మద్యం దుకాణ కార్మికుడికి రూ.3 వేలు, ద్విచక్ర వాహన మరమ్మత్తుదారుకు మరో రూ.3 వేలు రాజుకు ఇవ్వాలని సూచించారు. మిగిలిన రూ. 2 వేలు ఫిర్యాదుదారుణ వద్ద ఉన్నాయి.
Also Read: Man Hulchul Hyderabad: పోలీస్ బాస్ ఫోన్ నెంబర్ తో వ్యక్తి హల్చల్.. కేసు నమోదు!
లంచం వ్యవహారంలో ముగ్గురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని మిరుదొడ్డి స్టేషన్ లో విచారణ చేపట్టారు.ఈ ఘటనపై కేసు హోంగార్డు సంతోష్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ డీ ఎస్ పి సుదర్శన్ తెలిపారు. ఇదిలా ఉండగా కేసు మాఫీ విషయం హోమ్ గార్డు చేతిలో ఉండదని, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సూచన మేరకే ఇదంతా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
లంచం డిమాండ్ చేసింది.స్టేషన్ హౌస్ ఆఫీసర్.? బలైంది హోమ్ గార్డు :
మొత్తానికి లంచం వ్యవహారంలో హోమ్ గార్డు ను బాలికా బక్రాను చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. స్థానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ పై గతం లోనే అవినీతి ఆరోపణలు వచ్చిన నట్లు తెలుస్తుంది.సిద్దిపేట సీపీ అనురాధ గతంలోనే విచారణకు ఆదేశించి, సదరు ఎస్ ఐ కి మెమో జారీచేసినట్టు తెలిసింది. ఈ లంచం వ్యవహారం స్టేషన్ ఆఫీసర్ కు తెలియకుండా జరగధని జగమెరిగిన సత్యం.
మద్యం దుకాణం, నిర్వాహకుడుతో పాటు మరో ఇద్దరు ఏజెంట్ లను పెట్టుకుని లంచాల బాగోతం నడుస్తుందని, వారి ద్వారానే డబ్బులు వసూలు చేస్తున్న న్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతుల నుండి మొదలుకొని, ఎవరిని వదిలి పెట్టకుండా సదరు స్టేషన్ ఆఫీసర్ ఇబ్బందులు గురి చేస్తున్నాడని గతంలో ఆరోపణలు వచ్చాయి దుబ్బాక సీఐ ఆధ్వర్యంలో విచారణ కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై సైతం పోలీసులతో అధికారులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల విచారణలో అన్ని బయట పడే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Man Suicide: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో ప్రాణం బలి!