Vanasthalipuram (imagecredit:twitter)
క్రైమ్

Vanasthalipuram: సైబర్ మోసగాళ్ల వలలో రిటైర్డ్ ఇంజినీర్!

Vanasthalipuram: హైదరాబాద్‌లోని వనస్తలి పురంలో సుప్రీం కోర్టు జస్టిస్ పేరు చెప్పి, రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటిన్నర రూపాయలను సైబర్ నేరగాళ్లు కొట్టేసారు. నకిలీ కోర్టు సృష్టించి నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి సైబర్ నేరగాల్లు డబ్బులు కాజేసారు. వనస్థలిపురంలోని మాజీ చీఫ్ ఇంజనీర్ నివాసముంటున్నాడు. ఒక కేసులో మీ పేరు వచ్చిందని దీన్ని త్వరలో కేసు భయటికి వచ్చేలా తీర్పు రాభోతుందని భయ బ్రాంతులకు గురి చేసి, అతని నుంచి కోటిన్నర రూపాయలను సైబర్ నేరగాళ్లు కొట్టేసారు. మీపై కేసుకు సంబంధించి విచారణ సుప్రీంకోర్టులో జరుగుతుందని చెప్పి నమ్మించారు.

జస్టిస్ మీకు వీడియో కాల్

సుప్రీంకోర్టు జస్టిస్ స్వయంగా నీ కేసుని విచారిస్తున్నారని చెప్పి నమ్మిచ్చి బయబ్రాంతులకు గురి చేసారు సైబర్ నేరగాళ్లు. మీ కేసుకు సంబందించి జస్టిస్ మీకు వీడియో కాల్ చేస్తారు. అప్పుడు మీరు వీడియోకాల్ రాగానే నమస్కరించి మర్యాదగా మాట్లాడాలని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. చెప్పిన విధంగానే కొన్ని నిమిషాల్లోనే నకిలీ జస్టిస్ వీడియో కాల్ లోకి వచ్చి కేసు తీవ్రంగా ఉంది మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుందని నకిలీ జడ్జీ హెచ్చరించాడు. ఈ కేసుకు సంభందించి విషయమై కొన్ని డబ్బులను సుప్రీంకోర్టు అకౌంట్లో జమ చేయాలని నకిలీ జడ్జ్ నమ్మించి డబ్బు కాజేశాడు.

Also Read: Honeymoon Case: మేఘాలయ హనీమూన్ కేసులో సంచలన ట్విస్ట్

ఒక కోటి 50 లక్షల రూపాయలు

ఇప్పుడు మీరు పంపిన డబ్బులు కేసు అయిపోగానే తిరిగి వస్తాయంటూ చెప్పి నకిలీ జడ్జి నమ్మించాడు. దీంతో అతని మాటలు నమ్మిన ఇంజనీర్, నకిలీ జడ్జ్ చెప్పిన విధంగా డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసాడు. మోత్తం ఒక కోటి 50 లక్షల రూపాయలను డిపాజిట్ చేసాడు. తరువాత డబ్బులు తిరిగి రాకపోవడంతో వెంటనే రాచకొండ పోలీసులను రిటైర్ ఇంజనీర్ ఆశ్రయించాడు.

Also Read: Gaddar Film Awards: ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్’.. షీల్డ్ చూశారా!

 

 

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!