UP Crime: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. భర్తను ఓ భార్య ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది. బండరాయితో మోదీ.. ఆపై శరీరాన్ని గ్రైండర్ లో పడేసింది. ముక్కలైన శరీర భాగాలను డ్రైనేజీ, గంగానదిలో పడేసింది. అయితే ఎవరికీ అనుమానం రాకుండే తానే రివర్స్ లో పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. తన భర్త కనిపించడం లేదంటూ పోలీసుల ఎదుట వాపోయింది. రంగంలోకి దిగిన పోలీసులకు భర్త శరీర భాగాలు దొరకడంతో అసలు విషయాలు వెలుగు చూశాయి.
అసలేం జరిగిందంటే?
ఉత్తర్ ప్రదేశ్ లోని శంభాల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ కె.కె. బిష్ణోయ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులను రూబీ, గౌరవ్ (ప్రియుడు)గా గుర్తించారు. వారిని డిసెంబర్ 20న అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. జైలుకు కూడా తరలించినట్లు పేర్కొన్నారు. చందౌసీ ప్రాంతంలోని మెుహల్లా చున్నీకి చెందిన రూబీ, తన భర్త రాహుల్ (38) కనిపించకుండా పోయారంటూ నవంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు డిసెంబర్ 15న ఉద్గాహ్ ప్రాంతానికి సమీపంలోని ఒక డ్రైయినేజీలో కుళ్లిపోయిన స్థితిలో ఒక మృతదేహాం కనిపించింది. ఆ బాడీకి తల, చేతులు, కాళ్లు లేకపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాం
అయితే మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిర్వహించామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఫోరెన్సిక్ బృందం డీఎన్ఏ నమూనాలను సేకరించింది. మృతదేహంపై రాహుల్ అనే పేరు పచ్చబొట్టు ఉండటాన్ని గుర్తించింది. సమీప పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలించగా.. అది నవంబర్ 18న కనిపించకుండా పోయినా రూబీ భర్త అని పోలీసులు నిర్ధారించారు. తదుపరి దర్యాప్తులో రూబీ పాత్రపై పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించగా తానే భర్తను హత్య చేసినట్లు రూబీ అంగీకరించింది. అక్రమ సంబంధం పెట్టుకున్న గౌరవ్ సాయంతో తన భర్త రాహుల్ ను అంతమెుందించినట్లు ఆమె అంగీకరించిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
Also Read: Russian Envoy: బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. భారత్‌కు వ్యతిరేకంగా ర్యాలీలు.. రష్యా స్ట్రాంగ్ వార్నింగ్
నిందితులను జైల్లో పడేసిన పోలీసులు
తొలుత ఇనుప రాడ్, రోకలితో రాహుల్ పై వారిద్దరు దాడి చేయడంతో రాహుల్ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. అనంతరం గ్రైండర్ తెచ్చి మృతదేహాన్ని ముక్కలుగా చేసినట్లు ఎస్పీ బిష్ణోయ్ తెలిపారు. అనంతరం మృతదేహంలోని కొంత భాగాన్ని డ్రెయిన్‌లో పడేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. మిగిలిన భాగాలను రాజ్‌ఘాట్‌కు తీసుకెళ్లి గంగా నదిలో పడేశారని తెలిపారు. మృతదేహాన్ని విచ్చిన్నం చేయడానికి ఉపయోగించిన గ్రైండర్, పదునైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ జైలుకు తరలించినట్లు ఎస్పీ ఒప్పుకున్నారు.

