infected Hiv injection
క్రైమ్

Dowry Abuse: అదనపు కట్నం ఇవ్వలేదని హెచ్ఐవీ అంటించారు

Dowry Abuse:  అదనపు కట్నం తేవడం లేదని అత్త,మామ కలిసి తమ కోడలికి కలుషిత హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన హృదయవిదారకర ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఎన్నో రోజులుగా అడుగుతన్నప్పటికీ కట్నం ఇవ్వకపోవడంతో వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. విషయం తెలిసిన బాధితురాలి తండ్రి కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ కు చెందిన యువతికి, ఉత్తరఖండ్ లోని హరిద్వార్ కు చెందిన అభిషేక్ అనే యువకుడితో 2023 ఫిబ్రవరి 15న వివాహం జరిగింది. అప్పుడు యువతి తండ్రి రూ. 15 లక్షలు కట్నంగా ఇచ్చారు. పెళ్లి జరిగాక కొన్నాళ్లు కొడలిని బాగానే చూసుకున్న అభిషేక్ తల్లిదండ్రులు తర్వాత వేధించడం మొదలుపెట్టారు. కొత్త స్కార్పియో కొనేందుకు పుట్టింటి నుంచి మరో రూ. 25 లక్షలు తీసుకురావాలని ఒత్తిడి చేసేవారు. అంత డబ్బు తమ వద్ద లేదని కొడలి తల్లిదండ్రలు చెప్పడంతో ఆగ్రహించిన అత్తమామ… ఆమెను ఇంటి నుంచి గెంటేశారు.

ఇదీ చదవండి 

Woman hospitalized with Bird Flu: అమెరికాలో మహిళకు బర్డ్ ఫ్లూ

అనంతరం ఊరి పెద్దల సమక్షంలో వారికి నచ్చజెప్పి యువతిని తిరిగి కాపురానికి పంపించారు. అయినా అత్తమామల తీరు మారలేదు. అదనపు కట్నం కోసం అదేవిధంగా ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. ఈ క్రమంలో తమ కుమారుడికి మరో వివాహం చేయాలనే ప్లాన్ వేసి అందుకు అడ్డంగా ఉన్న కొడలిని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. అందులో భాగంగానే ఆమెకు కలుషితమైన హెచ్ఐవి ఇంజెక్షన్ చేశారు. కొద్దిరోజులకు ఆమె ఆరోగ్యం క్షిణించింది. వైద్యులను సంప్రదిస్తే హెచ్ఐవీ సోకినట్లు తెలిపారు. కానీ ఆమె భర్తకు మాత్రం నెగిటివ్ వచ్చింది. దీంతో యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. అక్కడ కూడా న్యాయం జరగకపోవడంతో స్థానిక కోర్టును ఆశ్రయించారు. కోర్టు  ఆదేశాల మేరకు అభిషేక్, అతని తల్లిదండ్రుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

Just In

01

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..