Bird Flu
అంతర్జాతీయం

Woman hospitalized with Bird Flu: అమెరికాలో మహిళకు బర్డ్ ఫ్లూ

Woman hospitalized with Bird Flu: తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ బయపెడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వందల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. పలు జిల్లాల్లోని కోళ్ల ఫారాల్లో పెద్ద  సంఖ్యలో కేసులు బయటపడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లూ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించి ఎక్కడికక్కడా నిఘాను ఏర్పాటు చేశారు.

ఏపీలో బర్డ్ ఫ్లూ ప్రభావం తీవ్రంగా ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. సరిహద్దులో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఏపీ నుంచి చికెన్ గానీ గుడ్లు గానీ రాష్ట్రంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇదిలా వుంటే… అమెరికాలో ఓ మహిళకు బర్డ్ ఫ్లూ సోకింది. వ్యోమింగ్ కు చెందిన ఓ వృద్ధ మహిళ బర్ఢ్ ఫ్లూ తో ఆస్పత్రి పాలయ్యారు. తన ఇంట్లో ఉన్న కోళ్ల నుంచే ఆమెకు ఈ వ్యాధి సోకినట్లు భావిస్తున్నారు. ఈ వార్త విన్న కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడి ప్రకంపనలు అక్కడికి వ్యాపించాయా అని అవాక్కవుతున్నారు.

ఇది కూడా చదవండి:  Guillain barre syndrome: జీబీఎస్​ డేంజర్​ బెల్స్

మరోవైపు, బర్డ్ ఫ్లూ ఒకవేళ మనుషులకు సోకితే లక్షణాలు ఇలా ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. జ్వరం వచ్చి శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుందని, అలాగే తీవ్రమైన గొంతు నొప్పి దానితో పాటు పొడి దగ్గు కూడా ఉండొచ్చని తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారికి శరీరమంతా నొప్పిగా ఉంటుందని, తీవ్ర అలసటగా అనిపిస్తుందని చెప్తున్నారు. శరీరమంతా కండరాల నొప్పితో బాధపడొచ్చు. కళ్ళు ఎర్రబడటం, నీరు కారడం వంటి లక్షణాలు రావచ్చు అని సూచించారు.

ఏదైమైనా ఈ బర్డ్ ఫ్లూ భయం తగ్గే వరకు కష్టమే అయినా నాన్ వెజ్ ప్రియులు కొన్నాళ్లు చికెన్ కు దూరంగా ఉండటం మంచిది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు