షాద్ నగర్ స్వేచ్ఛ: Shadnagar: షాద్ నగర్ లో దోంగలుహల్చల్ చేశారు. చోరులు తమ చేతి వాటo ప్రదర్శించి మూడు వ్యవసాయ ట్రాక్టర్లకు సంబంధించిన బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి వరుస దొంగతనాలకు పాల్పడ్డారు.
గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ బ్యాటరీ, వాడ్యాల శ్రీనివాస్ రెడ్డికి ట్రాక్టర్ బ్యాటరీ, మరియు దిర్శనం వెంకటయ్య ట్రాక్టర్ , వడ్డే శంకర్ ఆటో బ్యాటరీ లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు అని తెలిపారు. వీటంతో పాటు బాలరాజ్‌కు చెందిన టిప్పర్ బ్యాటరీ అపహరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు అని, సుమారు వాటి విలువ లక్షకు పైగా విలువ చేస్తాయని చెప్పారు.
వరుస దొంగతనాలతో గ్రామంలో భద్రతపరంగా పెట్రోలింగ్ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: Visakhapatnam Crime: 8 నెలల గర్భిణీ మహిళను చంపిన భర్త.. విశాఖలో దారుణం..