Visakhapatnam Crime: నిండు గర్భిణీ.. 8 నెలల బిడ్డను తన కడుపులో మోస్తోంది. కానీ కసాయి భర్త చేతిలో ఆ గర్భిణీ ప్రాణాలు వదిలింది. ఇంతటి దారుణ ఘటన ఏపీలోని విశాఖలో సోమవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటే ఎవరికైనా కన్నీళ్లు రావాల్సిందే.
స్థానికుల వివరాల మేరకు..
విశాఖ జిల్లా మధురవాడ ఊడా కాలనీలో జ్ఞానేశ్వరరావు, అనూష అనే దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట సంసారం సాఫీగానే సాగింది. ఆ తర్వాత తన భార్య అనూషపై జ్ఞానేశ్వర్ కు అనుమానం పెరిగింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. జ్ఞానేశ్వర్ మరొక అమ్మాయితో సంబంధాన్ని కలిగి ఉండడమే. ఆ విషయం తెలుసుకున్న అనూష పలుమార్లు జ్ఞానేశ్వర్ తో వాదులాటకు దిగేది. చివరకు వీరిద్దరి మధ్య ఇదే విషయంపై తరచూ గొడవ జరిగేది.
పీక పిసికి భార్యను చంపిన జ్ఞానేశ్వర్
ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి అనూషను భర్త జ్ఞానేశ్వర్ ఏకంగా పీక పిసికి చంపిన ఘటన సోమవారం జరిగింది. మధురవాడ ఆర్టీసీ డిపో పక్కనే నివాసముంటున్న వీరు, తరచూ ఘర్షణలకు పాల్పడుతుండడంతో స్థానికులు అప్పుడప్పుడు వారించేవారు. అయితే ఎనిమిది నెలల గర్భిణీ అయినా అనూష ఇటీవల ఇంటి వద్దే ఉంటుంది. ఏ విషయంలో ఘర్షణ వచ్చిందో ఏమో కానీ జ్ఞానేశ్వర్ సహనం కోల్పోయి ఏకంగా ఎనిమిది నెలల గర్భిణీ అయిన తన భార్య గొంతు నొక్కి మరీ ఊపిరాడకుండా చేసి హత్యకు యత్నించాడు.
అప్పటికే స్థానికులు గమనించి అనూషను వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిది నెలల గర్భిణీ మహిళను చంపిన భర్త జ్ఞానేశ్వర్ ను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Also Read: Twist in Aghori Story: అఘోరీకి బిగ్ షాక్.. తెరపైకి రహస్య భార్య.. పాపం వర్షిణి!
గర్భిణీ మహిళ చనిపోయినట్లు సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద ఎత్తున వారి ఇంటి వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే అసలు అనూష మృతికి గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.
విశాఖపట్నంలో దారుణం.. గర్భిణీని గొంతు నులిమి హత్య చేసిన భర్త
పీఎం పాలెం ప్రాంతంలో ఉండే జ్ఞానేశ్వర్, అనూష మధ్య కొద్దికాలంగా మనస్పర్థలు.
ఈ క్రమంలో మరికొద్ది గంటల్లో డెలివరీ కావాల్సి ఉన్న సమయంలో భర్త ఘాతుకం.
భార్య అనూష గొంతు నులిమి హత్య చేసిన జ్ఞానేశ్వర్.
ఆపై తానే ఈ… pic.twitter.com/JrXNDsGTTw— ChotaNews App (@ChotaNewsApp) April 14, 2025