Suside Crime: ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని ఓ పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి తిట్టటంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం గోపులాపురం(Gopulapuram) గ్రామంలో జరిగింది. మోకిలా పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గోపులాపురం గ్రామ వాస్తవ్యుడు అనిల్(Anil) (28) ఓ ప్రైవేట్ వర్సిటీలో ఆఫీస్ బాయ్(Office Boy) గా పని చేస్తున్నాడు. ఎప్పటిలానే బుధవారం డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తరువాత చలిగా ఉంది పడుకుంటానని తల్లితో చెప్పి గదిలోకి వెళ్లిపోయాడు.
Also Read: Hindu Man lynching: హిందూ యువకుడిపై మూకదాడి.. హత్య.. బంగ్లాదేశ్‌లో మరో ఘోరం
భోజనానికి రాకపోవటంతో..
అయితే, భోజనానికి బయటకు రాకపోవటంతో తల్లి పలుమార్లు పిలిచింది. అయినా, అనిల్ నుంచి ఎలాంటి జవాబు రాలేదు.దాంతో ఇరుగుపొరుగు సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా అనిల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఉండటం కనిపించింది. వెంటనే అతన్ని కిందకు దింపి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అనిల్ చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. కాగా, ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి తనకు ఓటు వేయలేదని అనిల్ ను నోటికొచ్చినట్టుగా దూషించాడని అనిల్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మనస్తాపంతోనే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంది. ఈ మేరకు కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: BC Reservations: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీల ట్విస్ట్.. పెద్ద ప్లాన్ వేశారు..?

