Prakasam Crime (image credit:Twitter)
క్రైమ్

Prakasam Crime: ప్రకాశంలో టిడిపి లీడర్ దారుణ హత్య.. లోకేష్ సీరియస్..

Prakasam Crime: ప్రశాంతంగా ఉండే ప్రకాశం జిల్లా ఒక్కసారిగా వేడెక్కింది. ప్రకాశం జిల్లాకి చెందిన టిడిపి నాయకుడు హత్యకు గురి కావడంతో జిల్లాకు చెందిన టిడిపి శ్రేణులు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ సైతం వెంటనే నిందితులను పట్టుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

వివరాలలోకి వెళితే..
నాగులుప్పలపాడు మాజీ మండల అధ్యక్షుడు వీరయ్య చౌదరి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించిన సమయంలో సైతం వీరయ్య చౌదరి కీలక పాత్ర వహించారు.

కాగా ఒంగోలు లోని మినీ బైపాస్ లో గల తన అపార్ట్మెంట్ కార్యాలయంలో మంగళవారం వీరయ్య చౌదరి కూర్చుని ఉన్న సమయంలో, ముసుగులు వేసుకుని వచ్చిన వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా పొడిచినట్లు ప్రత్యక్ష సాక్షుల సమాచారం.

కత్తులతో పొడిచి హత్య చేసినట్లు సమాచారం అందుకున్న స్థానిక ప్రజలు అప్రమత్తం అయ్యేలోగానే హత్యకు పాల్పడ్డ దుండగులు అక్కడి నుండి పారిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే వీరయ్య చౌదరిని స్థానిక వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులను నిర్ధారించారు.

వీరయ్య చౌదరి సంతనూతలపాడు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను చూసుకుంటూ, మద్యం వ్యాపారంలో రాణిస్తున్నారు. అయితే మద్యం సిండికేట్ వ్యవహారాలతోనే ఆర్థిక వివాదాలు కారణంగా ఈ హత్య జరిగినట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని అసలేం జరిగిందనే కోణంలో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వీరయ్య చౌదరి మృతదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రత్యేక పోలీస్ టీం ఏర్పాటు – ఎస్పీ
వీరే చౌదరి హత్య జరిగినట్లు సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా నేరం జరిగిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలను సేకరించగా, హత్యకు పాల్పడ్డ వారిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా చేధిస్తామని ఎస్పీ అన్నారు.

ఠిన చర్యలు తీసుకుంటాం – మంత్రి స్వామి
ఒంగోలు జీజీహెచ్ వైద్యశాలలో గల వీరయ్య చౌదరి మృతదేహానికి మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వీరయ్య చౌదరి లాంటి నేతను పార్టీ కోల్పోవడం బాధాకరమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తప్పవని, చౌదరి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మంత్రి భరోసానిచ్చారు.

Also Read: Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడకు బిగ్ షాక్.. మాజీ సీఎం జగన్ కు కోపమొచ్చిందా?

పార్టీ అండగా ఉంటుంది – మంత్రి నారా లోకేష్
సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన టిడిపి నేత, పార్టీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి హత్య వార్త తెలుసుకున్న నారా లోకేష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గల చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణ ఘటనగా వర్ణించిన నారా లోకేష్, వెంటనే హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. యువకులం పాదయాత్రలో తనతో పాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ