Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ షాకిచ్చింది. ఊహించని రీతిలో పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి అంటే తెలియని వారు ఉండరు. ఇటీవల హైదరాబాదులో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించిన వీరు, ఇటీవల టెక్కలి నియోజకవర్గం లో సైతం పర్యటించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు, ఆయన భార్యకు వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మీడియాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం హైలైట్ గా మారింది. అయితే తాను దువ్వాడ శ్రీనివాస్ కు అండగా ఉన్నానంటూ దివ్వెల మాదిరి తెరపైకి వచ్చారు.
గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి దువ్వాడ శ్రీనివాస్ తో పాటు దివ్వెల మాధురి సైతం కృషి చేశారు. తనకు వైఎస్ జగన్ అంటే అమితమైన అభిమానమని, ఆయన పాలన ప్రజా సంక్షేమానికి నాంది పలుకుతుందని పలుసార్లు దివ్వల మాధురి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తిరుమల పర్యటన సమయంలో తాము త్వరలోనే వివాహం చేసుకున్నట్లు వీరు చెప్పుకొచ్చారు. పలు మీడియా చానెళ్ల లో ఇంటర్వ్యూలు ఇచ్చిన ఈ జంట, తాము ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని చెబుతూ వచ్చారు.
ఊహించని క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా దువ్వాడ శ్రీనివాస్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీనితో ఆయనపై పలువురు జనసేన పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదులు సైతం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు కార్యాలయం ప్రకటించింది.
Also Read: Trolls On Gold Price: బంగారాన్ని వదలని ట్రోలర్స్.. వీడియో తెగ వైరల్
మొత్తం మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి తనను సస్పెండ్ చేయడంపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించాల్సి ఉంది. అంతేకాకుండా తాను ఎప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని పలుమార్లు చెబుతూ వచ్చిన దివ్వెల మాధురి సైతం తన స్పందన తెలియజేసే అవకాశం సైతం మున్ముందు ఉందని చెప్పవచ్చు.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైయస్ఆర్సీపీ అధ్యక్షులు @ysjagan గారి ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. pic.twitter.com/kjFfWhSPCI
— YSR Congress Party (@YSRCParty) April 22, 2025