తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Thieves Arrested: దొంగతనాలు చేయటమే వృత్తిగా చేసుకున్న పాతనేరస్తున్ని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు సైదాబాద్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 15లక్షల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రీన్ సిటీ షాహీన్ నగర్ నివాసి హబీబ్ మహ్మద్ (37) వృత్తిరీత్యా ప్లంబర్. చేస్తున్న పనిలో ఆశించిన ఆదాయం రాకపోతుండటంతో దొంగతనాలు చేయటం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అరెస్టయి జైలుకు కూడా వెళ్లాడు. అయినా ప్రవృత్తిని మార్చుకోకుండా నేరాలు చేయటాన్ని కొనసాగిస్తున్నాడు.
ఈనెల 23న తెల్లవారుఝాము సమయంలో సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో చోరీ చేసి ఉడాయించాడు. ఈ మేరకు ఫిర్యాదు అందగా కేసులు నమోదు చేసిన సైదాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, టాస్క్ ఫోర్స్ సీఐ సైదాబాబు, సైదాబాద్ సీఐ రాఘవేంద ర్ తోపాటు సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి హబీబ్ మహ్మద్ ను అరెస్ట్ చేశారు.
విచారణలో చోరీ సొత్తును హబీబ్ అలీ అనే వ్యక్తికి ఇచ్చినట్టు చెప్పటంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Kurnool News: మందుబాబు దెబ్బకు.. పోలీసుల మైండ్ బ్లాక్.. అసలేం జరిగిందంటే?