Hyderabad Students Died: బ్రిటన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్(Hyderabad) కు చెందిన ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనాకరంగా ఉన్నట్టు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. నాదర్ గుల్ నివాసి చైతన్య (23) బీటెక్ పూర్తి చేసి ఉన్నత విద్యల కోసం ఎనిమిది నెలల క్రితం బ్రిటన్ లోని ఎసెక్స్ నగరానికి వెళ్లాడు. అక్కడ బోడుప్పల్ కు చెందిన రిషితేజ (21)తోపాటు మరికొందరితో పరిచయం ఏర్పడింది.
Also Read: Jogulamba Gadwal: యూరియా కోసం తప్పని తిప్పలు.. చెప్పులతో క్యూ
చైతన్య అక్కడికక్కడే?
చవితి వేడుకలను పురస్కరించుకుని మిత్రబృందం వినాయకుని విగ్రహాన్నిప్రతిష్టించింది. విగ్రహాన్ని నిమజ్జనం చేయటానికి చైతన్య, రిషితేజతోపాటు మరో ఏడుగురు రెండు కార్లలో బయల్దేరి వెళ్లారు. నిమజ్జనం పూర్తయిన తరువాత తిరిగి వస్తుండగా వీరి కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదంలో చైతన్య అక్కడికక్కడే చనిపోయాడు. రిషితేజ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మిగిలిన వారు రాయల్ లండన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వీరిలో గౌతం రావు, నూతన్ ల పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. ప్రమాదం జరిగినపుడు కార్లు నడిపిన గోపీచంద్, మనోహర్ లను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం ఇటు నాదర్ గుల్…అటు బోడుప్పల్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. వీలైనంత త్వరగా చైతన్య, రిషితేజల మృతదేహాలను స్వస్థలాలకు తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలంటూ మృతుల కుటుంబీకులు విజ్ఞప్తి చేశారు.
Also Read: TG MBBS Admissions: ఎంబీబీఎస్ అడ్మిషన్ల కు లైన్ క్లియర్.. హైకోర్టు ఉత్తర్వులు రద్దు