SI Drank Insecticide, Is In Critical Condition: పోలీస్ అధికారులు ఎటువంటి ఇష్యూ వచ్చినా సరే భయపడకుండా వాటిని స్ట్రాంగ్‌గా ఉంటూ వాటిని ఎదుర్కొవాలని మోటీవేట్ చేస్తూ ప్రజలకు పలు సూచనలను చేస్తుంటారు. కానీ ఓ ఎస్ఐ పురుగుల మందు తాగిన షాకింగ్ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే శ్రీను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగానని తానే స్వయంగా 108 అంబులెన్స్‌కు పోన్ చేసి వివరాలను చెప్పాడు ఎస్ఐ శ్రీను. సమాచారం అందుకున్న డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు సర్వయ్య, బాబురావు సంఘటనా స్థలానికి చేరుకొని ఎస్ఐ శ్రీనును 108 సిబ్బంది అత్యవసర చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎస్‌ఐని పరీక్షించిన డాక్టర్లు ఎస్ఐ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దీంతో హుటాహుటినా అర్ధరాత్రి 12 గంటల తర్వాత వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. బలవన్మరణానికి పాల్పడిన ఎస్‌ఐ స్వస్థలం నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామం.
ఆదివారం ఉదయం 8గంటలకు స్టేషన్‌కు వచ్చి సిబ్బందితో మాట్లాడారు. ఆ తర్వాత కారు నడుపుకుంటూ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన వద్ద రెండు సెల్ నంబర్లు స్విచ్చాఫ్ రావడంతో సిబ్బంది సీఐ జితేందర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన విచారణ చేపట్టగా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట ఆటవీ ప్రాంతంలో స్విచ్చాఫ్ అయ్యాయని గుర్తించినట్లు తెలిసింది.రాత్రి 10.30 గంటల వరకు కూడా ఎస్సై ఆచూకీ లభించక సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. కొద్దిరోజులుగా ఎస్సైపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తుండగా స్టేషన్‌లోని సిబ్బందికి, ఎస్సై మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: బీటీపీఎస్ లో పిడుగుపాటు
ఈ నేపథ్యంలో ఎస్ఐపై ఉన్నతాధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ శ్రీను అప్పటినుంచి మనస్థాపంతో అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ పదే పదే బాధపడుతూ ఉండేవాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగి ఉంటుందని డీఎస్పీ తిరుపతిరావు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి చర్యలకు ఎవరు కూడా పాల్పడకూడదని సిబ్బందిని కోరారు. అంతేకాకుండా ఎస్సై కుటుంబసభ్యులకు ధైర్యంగా ఉండండి అని సూచించారు.