జోగిపేట: Sangareddy District: రోజు సెల్‌ఫోన్‌ల దొంగతనాలు జరుగుతుండడంతో జోగిపేట ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చే ప్రయాణీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి నుంచి జోగిపేట మీదుగా వెళ్లే ప్రయాణీకులు కానీ, లేదా నారాయణఖేడ్, మెదక్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే ప్రయాణీకులు సైతం అమ్మో జోగిపేట ఆర్టీసీ బస్టాండా.. అంటూ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల్లోనే సుమారుగా 50 వరకు ఫోన్‌లు దొంగిలించబడ్డాయని తెలుస్తుంది. ఒక్కొక్క రోజు నాలుగు ఫోన్‌లు దొంగిలించబడ్డ సంఘటనలున్నాయి.
ఇతర ప్రాంతాలకు చెందిన ప్రయాణీకులు జోగిపేట మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నా వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి కూడా స్థానిక బస్టాండ్ లో దిగడానికి సంకోచిస్తున్నారు. మంగళవారం జోగిపేటకు చెందిన నితిష్ గౌడ్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఉగాది పండుగకు వచ్చి తిరిగి లింగం పల్లికి వెళ్ళడానికి హైదరాబాద్ బస్ ఎక్కి చూసూకోగా ప్యాంట్ జేబులో ఫోన్ కనిపించలేదు. ఆందోళనతో కుటుంబ సభ్యులకు తెలుపగ వారు వెళ్లి స్టేషన్ లో సీసీ ఫుటేజీ పరిశీలించగా బస్టాండ్ లో ఇటు వైపు ఉన్న సీసీ కెమెరాలు పని చేయలేదు.
Also Read: Minister Seethakka: లైంగిక దాడులపై మంత్రి సీతక్క సీరియస్.. పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు
దీంతో భాదితులు నిరాశతో వెను దిరిగారు. గత వారం రోజుల క్రితం స్థానిక పోలీసులు ఆర్టీసీ బస్టాండ్‌లోని సీసీ పుటేజీలను పరిశీలించగా బస్సులో ఎక్కుతున్న ప్రయాణీకుల జేబులో నుంచి సెల్‌ఫోన్‌లు దొంగిలిస్తున్నట్లుగా సీసీ పుటేజీల్లో రికార్డు అయ్యింది. అయితే వారంతా బస్టాండ్ ఆవరణలోనే కారును పార్కింగ్ చేసి అందులో ఎక్కి వెళుతున్నట్లుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ కారు కర్ణాటక పాసింగ్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ ప్రాంతంలో కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన బ్యాచ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీస్‌శాఖ ఐడీ పార్టీని ఏర్పాటు చేసారు. ఆదివారం సంత రోజున ఎక్కువగా బస్టాండ్, సంతలో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. కాబట్టి దొంగతనాలు జరిగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జోగిపేట బస్ స్టాండ్ లో బస్సుఎక్కితే ఫోన్ లు పోతాయన్న భయం నుంచి ప్రయాణీకులను దూరం చేయాల్సిన బాధ్యత పోలీసు శాఖకు ఉంది.
Also Read: Ameenpur Crime: పెరుగన్నం తిని చిన్నారుల మృతి కేసులో.. అసలు టార్గెట్ ఎవరంటే?