తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Minister Seethakka: లైంగిక దాడి ఘటనలను ఉపేక్షించేది లేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ పేట, హైదరాబాద్ లైంగిక దాడుల నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. లైంగిక దాడుల ఘటనలపై మంత్రి సీరియస్ అయ్యారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, సుధీర్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ లతో ఫోన్లో మాట్లాడారు.
Also Read: Fake Maize Seeds: రైతన్నకు భరోసా దక్కేనా? ఆశలన్నీ ఆ సమావేశంపైనే!
ఘటనలపై ఆరా తీశారు. కేసు పురోగతి వివరాలు, బాధితుల ఆరోగ్య పరిస్థితులను అధికారులు వివరించారు. బాధితులకు అన్ని రకాల సహాయం చేయడంతో పాటు, నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే నిందితులందరినీ అరెస్టు చేశామని, ఘటన వెలుగులోకి వచ్చిన వెను వెంటనే స్పందించామన్నారు. లైంగిక దాడులతో సంబంధం ఉన్న నిందితులందరినీ గంటల వ్యవధిలోనే అరెస్టు చేశామన్నారు.
బాధితులకు అండగా నిలిచామని, సఖి సెంటర్ సంరక్షణలో బాధితులను సంరక్షిస్తున్నామన్నారు. వారి బాగోగులు అన్నింటిని ప్రభుత్వమే చూసుకుంటుందని తెలిపారు. నిందితులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. లైంగిక దాడి ఘటన కు మత్తు పదార్థాలూ కారణమని భావిస్తున్నామన్నారు. మత్తు పదార్థాల కట్టడి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. గస్తీ పెంచాలని పోలీస్ శాఖను కోరారు. పోలీస్ శాఖ సహకారంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు