తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: MLC Balmuri venkat: బీఆర్ ఎస్, బీజేపీ నేతలకు మై హోమ్ మీద ప్రేమ ఎందుకు? అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ బంధం స్పష్టంగా తెలుస్తుందన్నారు. కంచే భూములపై వివాదం తగదన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూరేందుకు ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..2004లో కంచే గచ్చిబౌలి సర్వే నంబరు 25లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నట్టు అప్పటి రిజిస్ట్రార్ సంతకం చేశారని వివరించారు.
ఈ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందాలని కొందరు భావించారని గుర్తు చేశారు. బీఆర్ ఎస్ హయంలో మై హోమ్ విహంగకు 25 ఎకరాలు కట్టబెట్టారన్నారు. రెండు భవనాలకే వంద ఫీట్ల రోడ్లు కేటీఆర్ ప్రమేయంతోనే వేశారని వెల్లడించారు. ఇక ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూమిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు పేర్లతో 20 ఎకరాలు ఆక్రమించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
Also Read: LB Nagar Court verdict: పాపం పడింది.. మైనర్ బాలిక రేప్ కేసులో సంచలన తీర్పు
ఆ 20 ఎకరాలను ప్రభుత్వం గుంజుకుంటుందనే భయంతోనే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన మై హోమ్ నిర్మాణాల వద్దకు ఫ్యాక్ట్ పైండింగ్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మై హోమ్ కు భూములు ఇచ్చినప్పుడు పర్యావరణం దెబ్బతింటుందనే విషయం కేటీఆర్ కు తెలియదా? అంటూ నిలదీశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు