MLC Kavitha in custody of ED
క్రైమ్

Delhi Liquor Case: ‘లిక్కర్ కేసు ప్లాన్ కవితదే’.. బెయిల్‌పై తీర్పు రిజర్వ్

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఉభయ పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. 8వ తేదీన ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనుంది. కాగా, సాధారణ బెయిల్‌పై వాదనలు 20వ తేదీకి వాయిదా వేసింది.

ఎమ్మెల్సీ కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఒక మహిళ, ఒక చట్టసభ్యురాలిగా ఆమె బెయిల్ పొందవచ్చని వాదించారు. ఆమె అరెస్టు చట్ట విరుద్ధం అని, వెంటనే ఆమెను విడుదల చేయాలని అన్నారు. కొడుకు పరీక్షల దృష్ట్యా ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారని వివరించారు. కుమారుడికి తల్లిగా ఆమె సహకారం అవసరమని, ఆమె కొడుకు ఒంటరిగా భయంలో ఉన్నాడని పేర్కొన్నారు. తల్లితో అనుబంధాన్ని వేరొకరు భర్తీ చేయలేరని అన్నారు. ఆ పిల్లాడు ఒంటరిగా ఉంటున్నాడని పేర్కొన్నారు. తల్లి జైలులో ఉంటే.. తండ్రి కోర్టుల కోసం ఢిల్లీలోనే ఉన్నాడని తెలిపారు. కాబట్టి, తమ క్లయింట్ కవితకు మధ్యంతర బెయిల్ ఈ నెల 16వ తేదీ వరకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: ఇప్పుడే ఇలా ఉంటే.. మే నెలలో మాడుపగిలేలా?

పిల్లల పరీక్షలు మానవతాకోణం కిందికి రావని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. ఆమె చిన్నకొడుకు ఒంటరిగా లేడని, 22 ఏళ్ల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసే ఉన్నారని చెప్పారు. పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ అడుగుతున్నారని, కానీ, అందులో కొన్ని పరీక్షలు ఇప్పటికే అయిపోయాయని తెలిపారు. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వరాదని అభ్యంతరం తెలిపారు. బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేస్తారని ఆరోపించారు. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పరాదని బెదిరించారని పేర్కొన్నారు. ఆమెకు వ్యతిరేకంగా కేసులో ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ వాటిని న్యాయమూర్తికి సమర్పించారు. అసలు లిక్కర్ కేసు ప్లానర్ కవితదేనని వాదించారు. ఆమె తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని అన్నారు. మొత్తం పది ఫోన్లు ఇచ్చారనీ, కానీ, అవన్నీ ఫార్మాట్ చేసినవేనని తెలిపారు. కాబట్టి, ఆమెకు బెయిల్ ఇవ్వరాదని అన్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!