Robbery in Shadh nagar (imagecredit:swetcha)
క్రైమ్

Robbery in Shadh nagar: దొంగలకే దొంగ డిఫరెంట్ దొంగ.. ఆమ్లెట్ వేసుకొని మరి!

Robbery in Shadh nagar: దొంగలు రకరకాలుగా ఉంటారు. బందిపోట్లు, గజ దొంగలు, డాకులు, చెడ్డి దొంగలు, బనియన్ దొంగలు, ముసుగు దొంగలు అని సమాజంలో అమాయకులను పేదలను ఉన్నోళ్లను లేనోళ్లను అందరిని దోచుకుంటారు. కానీ ఒక్కొక్కడి దొంగతనానికి ఒక్క లెక్క ఉంటది. అన్నట్టు డిఫరెంట్ స్టైల్స్‌లో స్పందిస్తూ ఉంటారు. దర్జాగా ఇంట్లోకి వచ్చి గుడ్లు కనిపించేసరికి ఆమ్లెట్ వేసుకొని మరి ఆరగించాడు ఓ దర్జా దొంగ. చివరాఖరికి తన దొంగతనానికి ఇంట్లో వాళ్ళు ఏమీ పెట్టలేదు అన్నట్టు మండిందో ఏమో ఇంట్లో ఉన్న దుస్తులని కాల్చేశాడు.

మున్సిపాలిటీ పరిధిలోని ఆఫీసర్స్ కాలనీ
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలోకి వెళితే రంగారెడ్డి(Ranagareddy) జిల్లా షాద్ నగర్(Shadh Nagar) మున్సిపాలిటీ పరిధిలోని ఆఫీసర్స్ కాలనీలో బోడంపాటి తిరుపతి గౌడ్(Thirupathi Goud) ఇంట్లో పై పోర్షన్ లో అద్దెకు ఉండే ఆంజనేయులు అనే ఓ పాత్రికేయుడు కుటుంబం గత మూడు రోజులుగా తాళం వేసి ఉండగా, ఇది గమనించిన దుండగుడు పక్క ఇంటి పై నుండి తిరుపతి గౌడ్ ఇంటి పై పోర్షన్ లోకి చేరుకొని తాళం పగలగొట్టి దొంగతనానికి యత్నించాడు.

Also Read: Fake Pensions: అక్రమ పింఛన్లకు చెక్.. ఇకపై అలా కుదరదు!

ఆమ్లెట్ వేసుకుని తిని
ఇంట్లోకి దూరిన దొంగ నింపాదిగా ఆమ్లెట్ వేసుకుని తిని, ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఒక దెగ్గర వేసి నిప్పంటించాడు. ఇంటి ముందు కెమెరాలు గమనించిన దుండగుడు వెనకవైపు నుండి మరో ఇంటి పైకి ఎక్కి ఈ ఇంట్లోని పై అంతస్తులోకి చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు(Police) దర్యాప్తు ప్రారంభించారు. షాద్ నగర్(Shadhnagar) పట్టణంలో తరచూ జరుగుతున్న దొంగతనాల వ్యవహారంలో పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని కోరుకుంటున్నారు.

Also Read: R.Narayana Murthy: దేశంలో విద్య వ్యాపారంగా మారింది: ఆర్.నారాయణ మూర్తి

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?