Illegal Ration Rice: అక్రమంగా తరలిస్తున్న 295 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. జహీరాబాద్ రూరల్ ఎస్సై కాశీనాథ్(SI Kashinath) తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్(Sangareddy)డి జిల్లా జహీరాబాద్ మండలం ఉగ్గేల్లి గ్రామ శివారులో బసవేశ్వర చౌక్ వద్ద జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో హైదరాబాద్(Hyderabad) నుండి ముంబై(Mmbai) వైపు వెళుతున్న లారీని తనిఖీ చేయగా అందులో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీలో ఉన్న బియ్యాన్ని లెక్కించగా 295 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నాయి.
రాష్ట్రంలో ఉచితంగా సరఫరా..
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ఉచితంగా సరఫరా అవుతున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది అక్రమార్కులు తక్కువ ధరకు కొనుగోలు చేసి గుజరాత్(Gujarath) కు తరలించి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. లారీ తో సహా 295 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని బియ్యం తరలిస్తున్న లారీ డ్రైవర్ భవార్యా అబ్దుల్ భాయ్ ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై కాశీనాథ్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
రాష్ట్రంలో పేదలందరికి ఉచిత రేషన్ బియ్యం అందినను ఎంత కట్టడి చేసినను ఓ పక్క పోలీసుల కన్ను కప్పిమరీ అక్రమంగా రేషన్ బియ్యాన్ని అమ్ముతున్నారు. కొందరు అక్రమార్కులు మోత్తం ఇదే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని తక్కవ ధరకు కొని పక్కరాష్టాలైన గుజరాత్, వివిధ రాష్టాలకు అధిక ధరలకు అమ్ముకొని కొందరు అక్రమార్కలు డబ్బులు పోగు చేసుకుంటున్నారు. వాటిని పెద్ద పెద్ద ఫుడ్ కంపెనీలకు పంపించి అధిక లాభాలను పొందుతున్నారు.
Also Read: Hyderabad Crime: హైదరాబాద్‌లో ఘోరం.. చట్నీ మీద వేశాడని.. దారుణంగా పొడిచి చంపారు!
