Jayashankar Bhupalapally: మోటార్లు బైకులు దొంగ అరెస్టు!
Jayashankar Bhupalapally ( IMAGE credit: swetcha reporter)
క్రైమ్

Jayashankar Bhupalapally: మోటార్లు బైకులు ట్రాన్స్‌ఫార్మర్ల దొంగ అరెస్టు!

Jayashankar Bhupalapally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మోటార్లు, బైకులు, ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ వైర్లను దొంగిలిస్తున్న ఓ దొంగను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రేగొండ ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. రేగొండ మండలం బాగిర్తిపేట క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, చర్లపల్లి శివ(Shiva) అనే వ్యక్తి బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, దొంగిలించిన బైక్‌తో పట్టుబడ్డాడు. విచారణలో నిందితుడు శివ తన బావమరిది శివరాత్రి లింగబాబుతో కలిసి గత కొంతకాలంగా రేగొండ, నెల్లికుదురు, లింగాల, దమ్మనపేట, ఇతర పరిసర మండలాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకొన్నాడు.

 Also Read: Hyderabad Tragedy: బండ్లగూడలో మరో విషాదం.. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్​

రూ. 75,000/- నగదు

నిందితుడు తనకున్న విద్యుత్ పనుల అనుభవాన్ని ఉపయోగించి, రాత్రి వేళల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, కాపర్ వైర్లను దొంగిలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి రూ. 75,000/- నగదు, రెండు దొంగిలించిన బైక్‌లు, 5 కిలోల కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శివను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు శివరాత్రి లింగబాబు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 Also Read:Crime News: ప్రియుడిని ఇంటికి పిలిపించి.. భర్తతో కలిసి… 

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క