brs ex mla shakeel and his son rahil
క్రైమ్

Old Case: పాత కేసు రీఓపెన్.. రాహిల్‌కే కాదు.. ఆ పోలీసులకూ తిప్పలే!

  • రాహిల్‌పై నమోదైన పాత కేసు రీఓపెన్
  • కేసు నుంచి తప్పించారన్న ఆరోపణలపై దర్యాప్తు
  • 2022 జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లో ప్రమాదం
  • రాహిల్ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టుకు పోలీసులు?

MLA Shakeel son case updates(Latest news in telangana): బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ యాక్సిడెంట్ కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అధికార అండతో తప్పుదారి పడితే ప్రమాదం చేసిన వ్యక్తి బయటికి.. అమాయకుడు జైలుకు వెళ్లే అవకాశాలూ ఉంటాయని ఆ ఉదంతం చూచాయగా తెలిపింది. అప్పుడే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేసులో చిక్కిన ఆ అమాయకుడు ఊపిరి పీల్చుకున్నాడు. ప్రమాదం చేసిన నిందితుడిపైనే కేసు నమోదైంది. తప్పటడుగు వేసిన అధికారులపైనా వేటు పడింది. అదే షకీల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ కేసు నుంచి కొడుకు రాహిల్‌ను సునాయసంగా తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసును పోలీసులు రీఓపెన్ చేశారు. బాధితుల స్టేట్‌మెంట్లను మళ్లీ రికార్డు చేయనున్నారు. దీంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు, ఆయన కొడుకు రాహిల్‌కు.. అలాగే.. రాహిల్‌ను తప్పించడానికి సహకరించిన పోలీసులకూ ఈ కేసు ఉచ్చుబిగిసే అవకాశం లేకపోలేదు.

గతేడాది డిసెంబర్‌లో బేగంపేట్‌లోని ప్రజా భవన్ వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో ప్రధాన నిందితుడైన రాహిల్.. ఆ ప్రమాదం తర్వాత తప్పించుకున్నాడు. దుబాయ్ పారిపోయాడు. అక్కడి నుంచి హైకోర్టును ఆశ్రయించి తనపై జారీ చేసిన లుకౌట్ నోటీసులు ఎత్తివేయాలని కోరారు. ఇక్కడికి తిరిగి వచ్చి దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు ఆదేశిస్తూ లుకౌట్ నోటీసులను తాత్కాలికంగా ఎత్తివేయాలని సూచించింది. అయితే, రాహిల్ తెలంగాణకు తిరిగి వస్తున్న విషయం పోలీసులకు ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి తెలియడంతో వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 8వ తేదీన రాహిల్‌ను అరెస్టు చేశారు.

Also Read: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఎయిర్‌పోర్టులో అరెస్టు.. రాహిల్ దుబాయ్ ఎలా వెళ్లాడు?

పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయగా.. కొట్టేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు రాహిల్‌కు మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దు కోరుతూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఇక్కడే మరో ట్విస్ట్ బయటికి వచ్చింది. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసు రీఓపెన్ చేసినట్టు తెలిసింది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సారథ్యంలో ఈ కేసులో దర్యాప్తు జరుగుతుందని తెలిసింది.

2022 మార్చి 17వ తేదీన జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45లో జరిగిన ప్రమాదం కేసులో రాహిల్ నిందితుడు. బెలూన్లు అమ్ముకుంటున్న కుటుంబం రోడ్డు దాటుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మరణించాడు. ఇద్దరికి గాయాలయ్యాయి. అప్పుడు కూడా కారు రాహిల్ నడిపాడని, కానీ, ఆయన స్థానంలో మరో డ్రైవర్‌ను ఉంచి కేసు నుంచి రాహిల్‌ను తప్పించారనే ఆరోపణలు వచ్చాయి. అప్పుడు షకీల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారని, అధికారం, పలుకుబడితో కొడుకు రాహిల్‌ను షకీల్ తప్పించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసును రీఓపెన్ చేస్తున్నారు. ఈ కేసులో బాధితుల స్టేట్‌మెంట్లు మరోసారి రికార్డ్ చేయనున్నారు. రాహిల్‌ను కూడా ఈ కేసులో విచారిస్తారు. అలాగే.. అప్పడు రాహిల్‌ను కేసు నుంచి తప్పించడానికి సహకరించినట్టు ఆరోపణలు ఉన్న పోలీసు అధికారులనూ విచారించే అవకాశాలు ఉన్నాయి. ఆరోపణలు నిజమేనని తేలితే వేటు పడే అవకాశాలూ లేకపోలేవు. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ పై పలు ఆరోపణలు రావడంతో 80 శాతం మంది సిబ్బందికి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?