Nepali workers Robbery (imagecredit:AI)
క్రైమ్

Nepali workers Robbery: నమ్మి పనిలో పెట్టుకుంటే.. చివరికి ఎంచేశారంటే!

తెలంగాణ: Nepali workers Robbery: నమ్మి పనిలో పెట్టుకుంటే ఇంటి యజమానిని లూటీ చేశారు నేపాలీ నౌకర్లు. యజమానులకు మత్తు మందు ఇచ్చి స్పృహ తప్పించి ఇంట్లో ఉన్న 2 కిలోల బంగారు నగలు, 3 కోట్ల రూపాయల నగదుతో ఉడాయించారు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన కాచిగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాగ్​ లింగంపల్లి ప్రాంత నివాసి హేమరాజ్ వ్యాపారి. కాగా, కొన్నిరోజుల క్రితం నేపాల్​ దేశానికి చెందిన వారు ఆయన ఇంట్లో పనికి కుదిరారు.

వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, పోలీసులతో వెరిఫై చేయించకుండా హేమరాజ్ ఉద్యోగాలు ఇచ్చాడు. కాగా, వ్యాపార లావాదేవీల్లో భాగంగా వచ్చే డబ్బును హేమరాజ్​ ఇంటికి తెచ్చి భద్రపరుస్తుండటాన్ని నౌకర్లు గమనించారు. ఈ క్రమంలో దొంగతనానికి పథకం వేశారు. దీని ప్రకారం సోమవారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపి హేమరాజ్ అతని భార్యకు ఇచ్చారు.

Also Read: Lady Aghori Arrested: అఘోరీకి బిగ్ షాక్.. అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. ఎందుకంటే?

అది తిన్న ఇద్దరు స్పృహ కోల్పోయారు. అదే అవకాశంగా నేపాలీ నౌకర్లు లాకర్లు తెరిచి 2 కిలోల బంగారు ఆభరణాలు, 3 కోట్ల రూపాయల నగదును తస్కరించి ఉడాయించారు. ప్రతీరోజూ మార్నింగ్ వాక్​ కు వచ్చే హేమరాజ్​ ఉదయం రాకపోవటంతో ఆయన స్నేహితుడు ఇంటికి వచ్చాడు. చూడగా హేమరాజ్ దంపతులు స్పృహ లేని స్థితిలో కనిపించారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించిన ఆయన హేమరాజ్ కుమారునికి సమాచారం అందించాడు.

ఈ క్రమంలో ఇంటికి వచ్చిన హేమరాజ్ కుమారుడు దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా అనుమానితుల ఫోటోలను సేకరించారు. ప్రస్తుతం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Just In

01

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు