Crime News( image credit: twitter)
క్రైమ్

Crime News: కన్నతల్లి కర్కశత్వం.. సొంత బిడ్డపైనే దారుణం!

Crime News: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో జరిగిన హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం రెండు నెలల పసికందును కన్నతల్లి హత్య చేసి బావిలో పడేసిన ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 21న పసికందు (కుమారుడు) మాయమైనట్లు తల్లి కవిత కుటుంబ సభ్యులకు గుర్తు తెలియని వ్యక్తులు బిడ్డను కిడ్నాప్ చేశారని మాయ మాటలు చేప్పి నమ్మించాలని అనుకున్నది.

Also Read: Balanagar Crime: సెలవుల్లో ఎంజాయ్​ చేద్దామని.. చిన్నారిపై అఘాయిత్యం!

అయితే నిన్న భర్త శ్రీమాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కవిత చెప్పిన మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను విచారించగా నిజాలు బయటపడ్డాయి. పోలీసుల ఆరా తీసినప్పుడు కవిత తానే బిడ్డను బావిలో పడేసినట్లు ఒప్పుకుంది. కన్న తల్లే కసాయి తల్లిగా మారి ఇంతటి ఘోరానికి పాల్పడింది. పోలీసులు వెంటనే బావిని పరిశీలించి బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణ ఘటనపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు దుబ్బాక పోలీసులు నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివారాలు అందిస్తామని తెలిపారు.

Also RaadPrivate Schools: ఎల్‌కేజీకి లక్షల రూపాయల ఫీజా? తల్లిదండ్రుల ఆవేదనను ఎవరు వింటారు?

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం