Bike Robbery: డ్రగ్స్ మద్యానికి బానిసైన నలుగురు యువకులు బైక్ దొంగలుగా మారారు. వీరిలో ఇద్దురు బైక్‌మెకానిక్(Bike Mechanic)లు కావడంతో ఇండ్ల ముందు, రద్దీ ప్రదేశాల్లో పార్కింగ్‌చేసిన బైకులను దొంగలిస్తూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. బైకు దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను మియాపూర్ పోలీసులు(Miyapur Police) అరెస్ట్‌చేశారు. వీరి నుంచి రూ.30 లక్షల విలువైన 13 బైకులతో పాటు 406 సెంట్రింగ్బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్జోన్ఏడీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి(Uday Kumar), మియాపూర్ఏసీపీ శ్రీనివాస్‌కుమార్(Srinivass Kumar)తో కలిసి మియాపూర్పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
మద్యానికి, డ్రగ్స్‌కు బానిసై…
కొల్లూరు డబుల్ బెడ్రూంలో నివాసం ఉండే శ్రీకాంత్(24), మియాపూర్గోకుల్ ప్లాట్స్‌లో ఉండే వెంకటేశ్వర్లు(23), వేణు(20), అఖిల్‌రెడ్డి(23) నలుగురు స్నేహితులు. వీరిలో శ్రీకాంత్, వెంకటేశ్వర్లు బైక్మెకానిక్లుగా పనిచేస్తున్నారు. వేణు లేబర్ పని చేస్తుండగా, అఖిల్‌రెడ్డి ఓ ప్రముఖ యూనివర్సిటీలో బిటెక్మధ్యలోనే అపేసి ఖాళీగా ఉంటున్నాడు. నలుగురు మద్యానికి బానిసయ్యారు. దీనికితోడు వెంకటేశ్వర్లుకి గంజాయి తాగే ఆలవాటు ఉంది. పనిచేస్తుండగా వచ్చే డబ్బులు జల్సాలు చేసేందుకు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని డిసైడ్ అయ్యారు.
బైకుల హ్యాండిల్లను విరగొట్టి
శ్రీకాంత్, వెంకటేశ్వర్లు ఇద్దరు బైక్ మెకానిక్‌లు కావడంతో నలుగురు కలిసి ఇండ్ల ముందు, పార్కింగ్‌ప్రదేశాల్లో పార్కింగ్‌చేసిన బైకుల(Bike)ను దొంగలించాలని నిర్ణయించుకున్నారు. పార్కింగ్ప్రదేశాలు, ఇండ్ల ముందు పార్కింగ్ చేసిన బైకుల హ్యాండిల్లను విరగొట్టి బైకులను దొంగలిస్తారు. దొంగలించిన బైకులను ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)కు తరలించి అక్కడ రూ. 15వేల నుండి 20వేల వరకు అమ్మేస్తారు. కొన్ని బైకులను పార్టు పార్టులుగా విడదీసి కేజీ రూ. 30 చొప్పున అమ్మేసి వచ్చిన డబ్బులను జల్సాలకు ఖర్చు చేస్తున్నారు.
Also Read: Rowdy-Sheeters: హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్ల పేర దండిగా వసూల్లు!
సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు
ఈ నెల 10వ తేదిన మియాపూర్ఆర్టీసీ కాలనీ(Miyapur RTC Colony) కి చెందిన ఓ వ్యక్తి తన రాయల్ఎన్ఫైల్డ్బైక్ను రాత్రి 10 గంటలకు తన ఇంటి ముందు పార్కింగ్చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి బయటకు వచ్చిన యజమానికి ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్కనిపించలేదు. దీంతో మియాపూర్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బైక్ దొంగతనానికి పాల్పడ్డ శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, వేణు, అఖిల్రెడ్డిలను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రూ.30 లక్షల విలువైన13 బైకులు, 406 సెంట్రింగ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.
కమిషనరేట్ల పరిధిలో బైకు దొంగతనాలు
కాగా బైకు దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో ఇద్దరు పాతనేరస్థులుగా ఉన్నారు. బైక్మెకానిక్లుగా పనిచేస్తున్న శ్రీకాంత్‌పై హైదరాబాద్(Hyderabad), సైబరాబాద్కమిషనరేట్ల పరిధిలో బైకు దొంగతనాల కేసు ఉన్నాయి. కేపిహెచ్బీ పోలీస్స్టేషన్లిమిట్స్(KPHP Police Station)లో బైక్దొంగతనం కేసులో అరెస్ట్అయ్యాడు. మరో నిందితుడు వెంకటేశ్వర్లు మియాపూర్పోలీస్స్టేషన్పరిధిలో గంజాయి కేసులో అరెస్ట్‌అయ్యి జైలుకు వెళ్లివచ్చాడు. ఇద్దరు కలిసి సైబరాబాద్, హైదరాబాద్లిమిట్స్లో 15 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ సమావేశంలో మియాపూర్ఇన్స్పెక్టర్క్రాంతికుమార్, డిఐ రమేష్నాయడు, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Nagarkurnool Survey: చెంచులపై కేద్రం ఫోకస్.. వారి అభివృద్ధికి రెండేళ్ల ప్రత్యేక ప్రణాళికలు