Medipally Tragedy: కుటుంబ కలహాలతో మనస్థాపనికి గురై తన ముగ్గురు కూతుళ్ళతో సహా తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కన్మనూరు గ్రామం, అడ్డాకల్ మండలం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన లోకమని నాగరాజు (35), భార్య లోకమని సుజాత (32), లు పదిహేను సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్ లో మహాలక్ష్మి పురం కాలనీ, నారపల్లిలో నివాసం ఉంటూ, భార్య చెరుకు రసం అమ్ముతు, భర్త ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
వీరికి ముగ్గురు ఆడపిల్లలు పెద్ద కూతురు అక్షిత (13), 8 వ తరగతి, రెండో కుమార్తె ఉదయశ్రీ (11) 6 వ తరగతి, చిన్న కూతురు వర్షిణి (06) 1 వ తరగతి నారపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఈ మధ్య కాలంలో భార్యపై అనుమానంతో భార్య భర్తలు ఇద్దరు మధ్య గొడవలు జరగడంతో బుధవారం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. రాత్రి అంతా ఇద్దరు గొడవ పడుతూ ఉండడంతో సుజాత మనస్థాపనికి గురై తన ముగ్గురు పిల్లలతో కలిసి నారపల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
Also Read: Black Jaggery: యథేచ్ఛగా నల్ల బెల్లం దందా.. సహకరిస్తున్నఎక్సైజ్ అధికారులు?
కొందరు స్థానికులు గమనించి ఇద్దరు పిల్లలను రక్షించంగాలిగారు. కానీ తల్లి సుజాత, చిన్న కుమార్తె వర్షిణి నీటిలో మునిగి చనిపోయారు. మృతదేహలని వెలికితీసి గాంధీ ఆసుపత్రి కి తరలించారు. ఇద్దరు పిల్లలను కూడా గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమం గానే ఉందని బంధువులు తెలిపారు. సుజాత బంధువులు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.