Medchal district (imagecredit:swetcha)
క్రైమ్

Medchal district: పేకాట స్థావరంపై శామీర్ పేట పోలీసులు దాడులు!

Medchal district: పేకాట స్థావరంపై శామీర్ పేట పోలీసులు దాడులు నిర్వహించారు. భారీగా నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సెలెబ్రిటీ రిసార్ట్స్ లో గల ఓ విల్లాలో రాత్రి కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో శామీర్ పేట పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకులతో పాటు ప్రముఖ రియల్టర్లు మొత్తం 14 మంది ఉన్నట్లు తెలిసింది. వీరి వద్ద నుంచి సుమారు రూ. 6 లక్షల నగదుతో పాటు లక్షల్లో విలువ చేసే సెల్ ఫోన్లను, 4 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరం

విల్లాలోని ఈ పేకాట స్థావరం శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు కిలో మీటర్ దూరంలోనే ఉండటం గమనార్హం. నిత్యం రద్దీగా ఉండే కరీంనగర్ – హైదరాబాద్ రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న సెలెబ్రిటీ రిసార్ట్స్ లోని ఓ విల్లాలో జూదరులు పేకాట ఆడడం చర్చనీయంశమైంది. ఈ మేరకు గత రాత్రి పోలీసులు దాడులు నిర్వహించి పేకాట రాయుళ్ళను పట్టుకున్నారు. అనంతరం పేకాటరాయుల్లను పట్టుకున్నప్పటికి వారిపై శామీర్ పేట పోలీసులు ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Water Crisis: గిరిజన తండాలో నీటి కష్టాలు.. పట్టించుకోని అధికారులు!

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

పందెం లేకుండా పేకాడటం నేరం కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కర్ణాటక కో-ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్‌గా ఎన్నికైన హనుమంతరాయప్ప అనే వ్యక్తి ఓ రోజు రోడ్డు పక్కన పేకాట ఆడుతున్నారడని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి రూ.200 జరిమానా కూడా విదించారు. దీంతో ఆయనను పదవిని తొలగించగా, అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వినోదం కోసం పేకాడితే అది నైతిక తప్పిదం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. హనుమంతరాయప్ప ఎన్నికను పునరుద్ధరించాలని, పూర్తికాలం ఆయన పదవిలో ఉండటానికి అర్హుడని కోర్టు పేర్కోంది.

Also Read: Hyderabad Blast Conspiracy: సిరాజ్ కేసులో సంచలనాలు.. స్వర్గంలో చోటు దొరుకుతుందని చెప్పి!

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు