Gift Bag Stolen: పెళ్లికి దర్జాగా వచ్చాడు. భోజనం చేశాడు. ఆ తర్వాత చదివింపుల వద్దకు వచ్చి అక్కడ ఏం జరుగుతుందో గమనించాడు. చివరకు పెళ్లి తంతు జరుగుతున్న వారికి పెద్ద షాకిచ్చి వెళ్లిపోయాడు. దీనితో పెళ్లి ఆనందంలో ఉన్న వధూవరుల కుటుంబ సభ్యులకు ఆ ఆనంద క్షణాలు కొద్ది క్షణాల్లోనే ఆవిరై పోయాయి. పోలీసులు వచ్చారు.. చక చకా అసలు విషయం తేల్చి చెప్పేశారు. ఈ ఘటనతో శుభకార్యాలకు వచ్చే వారిపై ఒకింత నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని ఆ పెళ్లి పెద్దలు కోరుతున్నారు. అసలేం జరిగిందంటే..
ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉడతా వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. వరుడు రమేష్ పెళ్లికి ఆహ్వానించిన వారందరూ అక్కడికి చేరుకున్నారు. మండపం ఎంతో సందడిగా ఉంది. చిన్నారుల నుండి పెద్దల వరకు చిరునవ్వులు చిందిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
పెళ్లి తంతు పెద్దల సమక్షంలో సాగుతోంది. సాధారణంగా పెళ్లి జరుగుతుందంటే పెళ్లి చదివింపుల కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా వైపు సాగుతోంది. అంతలోనే చదివింపుల డబ్బులు నిలువచేసిన బ్యాగు మాయమైంది. ఇక అంతే వధూవరులతో పాటు పెళ్లికి వచ్చిన బంధువులు తెగ కంగారుపడ్డారు. చివరకు పోలీసుల వరకు విషయం వెళ్ళింది. పోలీసులు ఎంటర్.. అసలు విషయం చెప్పి ఇది కథ అంటూ తేల్చి చెప్పేశారు.
దోచింది ఎవరంటే?
సాధారణంగా ఎక్కడైనా శుభకార్యాలు జరిగే సమయంలో కొత్తవారు సైతం అక్కడికి వచ్చి భోజనం చేయడం సామాన్యమే. ఇటీవల ఆహ్వానాలు లేకుండా పెళ్లికి వస్తే కేసు కూడా పెట్టే హక్కు పౌరులకు లభించింది. కానీ శుభమా అంటూ శుభకార్యం జరిగే సమయంలో ఈ కేసుల గోల ఎందుకు అంటూ, కొందరు పిలవని పేరంటాలకు వచ్చిన వారిని ఆదరిస్తూనే ఉన్నారు.
అలాగే ఓ వ్యక్తి ఉడతా వారి కళ్యాణ మహోత్సవానికి వచ్చాడు. కమ్మగా భుజించాడు. ఇక తను వచ్చిన పని మొదలుపెట్టాడు. చదివింపులు చదివించే కార్యక్రమం వద్దకు వచ్చి ఎలా చదివింపులు సాగుతున్నాయో అడిగి తెలుసుకున్నాడు. అక్కడ గల వ్యక్తులు మాటామంతీ కలుపుకొని నవ్వుకుంటుండగా, ఒక్కసారిగా చదివింపులో క్యాష్ బ్యాగ్ మాయమైంది. ఇంకేముంది కొద్దిసేపు ఎవరు తీసుకెళ్లారో అంటూ కాసేపు గాలించారు.
Also Read: APPSC Job Notification: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. వరుస నోటిఫికేషన్స్.. మీరు సిద్ధమేనా?
చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కళ్యాణ మండపంలో గల సీసీ కెమెరా విజువల్స్ పరిశీలించారు. క్యాష్ బ్యాక్ తీసుకువెళ్లిన వ్యక్తి నేర చరిత్ర ఉన్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. త్వరలోనే అతని పట్టుకుంటామని పోలీసులు చెప్పగా, శుభకార్యానికి వచ్చిన వ్యక్తి భోజనం చేయడమే కాక చోరీకి పాల్పడడం ఏమిటంటూ అందరూ నివ్వెర పోయారు. మొత్తం మీద ఉడతా వారి పెళ్లికి వచ్చిన బుడతడు తన పని ఎంచక్కా సాగించుకుని వెళ్ళాడు. ఇక పోలీసులు పట్టుకోవడమే తరువాయి.