APPSC Job Notification: ఇప్పుడు కాకుంటే మరెప్పుడు.. అనే మాట ప్రస్తుతం నిరుద్యోగ యువత నోట వినిపిస్తోంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో, ఎన్నో ఏళ్లుగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూపుల్లో ఉన్న వారి ఆశలు నెరవేరే సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. ఆ పూర్తి వివరాలలోకి వెళితే..
ఏపీలో ఇటీవల మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ నిర్వహణపై సీఎం చంద్రబాబు నాయుడు చేశారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా సుమారు 16 వేలకు పైగా డీఎస్సీ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయగా ప్రస్తుతం అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా 44 ఏళ్లకు వయసు పెంచడంతో ఎందరో అభ్యర్థులకు దీంతో మేలు చేకూరనుంది.
ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులపై వరాల జల్లు కురిపించిన కూటమి ప్రభుత్వం మరిన్ని నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అధికారికంగా ఈ విషయాన్ని ప్రభుత్వం ధ్రువీకరించగా అభ్యర్థులు, ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూపుల్లో ఉన్నారు. నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం చెప్పిన మరో గుడ్ న్యూస్ ఏమిటంటే.. అతి త్వరలోనే ఏపీపీఎస్సీ ద్వారా 18 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
నోటిఫికేషన్లను విడుదల చేయడమే కాక, ఎస్సీ వర్గీకరణకు తగిన విధంగా రోస్టర్ పాయింట్లు కేటాయించేందుకు సైతం ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం, ఆ తర్వాత ఏపీపీఎస్సీ ద్వారా ఒకేసారి 18 నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా రానున్న నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు ఉన్న ఏపీ నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ఈ ప్రకటన ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.
Also Read: AP Heatwave: మండుతున్న ఏపీ.. ముందుందట అసలు సెగ..
ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగాలలో సైతం ఉపాధి కల్పించేందుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉచిత శిక్షణ, ఆపై ఉపాధి అందించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొత్తం మీద రానున్న 18 నోటిఫికేషన్ లకు యువత సిద్ధమవుతుండగా, కోచింగ్ సెంటర్లు ప్రస్తుతం కళకళలాడుతున్నాయి.