Hyderabad Crime: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడ ప్రాంతంలో ఆర్థిక లావాదేవీల విషయంలో జరిగిన గొడవ తీవ్రంగా మారింది. రవి, మహేష్ మధ్య జరిగిన వాగ్వాదం క్షణాల్లో హింసాత్మక రూపం దాల్చింది. డవను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మహేష్ బాబాయ్ శంకరయ్య (55)పై రవి కత్తితో దాడి చేసినట్లు సమాచారం.
Also Read: Hyderabad Crime: చెంగిచెర్లలో వరుస దొంగతనాలపై క్లూ సేకరించిన పోలీసులు..?
శంకరయ్యకు తీవ్ర గాయాలు
ఈ ఘటనలో శంకరయ్యకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ఘటనకు కారణమైన ఆర్థిక లావాదేవీల వివరాలు, గొడవకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: Hyderabad Crime: తరుచూ ఫోన్ మాట్లాడటంపై.. ప్రశ్నించిన లవర్.. సూసైడ్ చేసుకున్న ప్రేయసి

