Crime News: సీతాఫలాల కోసం వెళ్లిన వ్యక్తి బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన ఘటన అల్లాదుర్గం మండలం గొల్ల కుంట తండా లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు ఎస్సై వివరాల ప్రకారం గొల్ల కుంట తండా గ్రామపంచాయతీలోని కోమటికుంట తండా కు చెందిన బర్మావత్ జైరాం (28) సీతాఫలాల కోసం మాందాపూర్ గ్రామ శివారు అడవిలో రోజు వెళ్లేవారు. ఆదివారం సీతాఫలాలకు వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది అతని కోసం అడవికి వెళ్లి వెతుకుతుండగా మేకల కాపరివాళ్ళు చూసి చెన్నయి కుంట సమీపంలోని బావి వద్ద చెప్పులు, వస్తువులు కనిపించాయని తెలుపగా కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూశారు.
గాలింపు చర్యలు
మధ్యాహ్నం స్నానం చేసేందుకై బావిలో దిగి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లుగా గమనించి ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా జయరాం రామృతదేహం లభ్యమయింది. దీంతో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ముగ్గురు సంతానం ఒక కొడుకు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
Also Read: Kashmir Issue: కాశ్మీర్‌పై పాక్ ప్రధాని షరీఫ్ అనూహ్య వ్యాఖ్యలు
బీపీ ఎక్కువైనట్లు..
వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ కన్ను ముసింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో సోమవారం చోటు చేసుకుంది. ప్రసవం కోసం ఆదివారం రాత్రి అఖిల (23)అనే గర్భిణి ఆసుపత్రికి వచ్చింది. అయితే ఆర్డరాత్రి గర్భిణీకి బీపీ ఎక్కువైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ బీపీ పెరిగిందని చెప్పింది. కానీ అందుకు తగ్గట్టుగా చికిత్స చేయకపోవడంతోనే సోమవారం తెల్లవారుజామున అఖిల (23)అనే గర్భిణి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గం రావులపల్లి గ్రామానికి చెందిన మహిళాగా అని అధికారులు చెబుతున్నారు.
Also Read: OG movie: ‘ఓజీ’ టీంపై మండిపడుతున్న అభిమానులు.. ఎందుకంటే?