Ganja Peddlers: గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరికి 20 ఏండ్ల చొప్పున కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 2లక్షల జరిమాన విధిస్తూ మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె. ఉమాదేవి(K. Umadevi) తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కధనం ప్రకారం.. జల్సాలకు అలవాటు పడి, అక్రమార్జన కోసం 2021ఏప్రియల్ 28న మోతుగూడెం(Mothugudem) నుండి కారులో 30 లక్షల విలువ చేసే 200 కేజీల గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ ఖమ్మం సమీపంలోని వి. వెంకటపాలెం వద్ద పోలీస్ చెక్పోస్ట్ ఉందని, వేగంతో కారు నడుపుకుంటూ ప్రయాణికులతో కూడిన ఆటోను బలంగా డీ కొట్టడంతో ఆటో, కారు బోల్తా పడ్డాయి.
పరారీలో మరో నిందితుడు
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు(Police) ప్రమాదంలో మృతి చెందిన ఆటో ప్రయాణికుడిని మార్చురికి, గాయపడిన వారిని ఆసుపత్రి తరలించారు. అనంతరం కారు పరిశీలించగా 200 కేజీల 100 గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఇద్దరు నిండుతులను అదుపులో తీసుకోగా మరో నిండుతుడు పారిపోయాడు. నిండుతులపై రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో Cr.no 87/2021 U/s 304(A), 338, 337 IPC మరియు సెక్షన్ 8(c) R/w 20(b) of NDPS act, 1985 చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి సమగ్ర దర్యాప్తు అనంతరం కోర్టులో దాఖలు చేశారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి నిందితులపై మోపిన అభియోగం రుజువు కావటంతో పైవిధంగా తీర్పు చెప్పారు.
Also Read: Allu Arjun trolling: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అల్లు అర్జున్ వీడియో
A3 నిండుతుడు ఇషాక్ R/o గండిమైసమ్మ ప్రాంతం, హైదరాబాద్(Hyderabad) దిండిగల్ కు చెందిన వ్యక్తి పరారీలో వున్నాడు. ప్రాసిక్యూషన్ కు సహకరించిన విచారణ అధికారలు అప్పటి ఇన్స్పెక్టర్ P.సత్యనారాయణ రెడ్డి, ప్రస్తుత ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.శంకర్, జె. శరత్ కుమార్ రెడ్డి, ఎస్సై శ్రీనివాస్, కోర్టు కానిస్టేబుల్ జి.రవి కిషోర్, సాంబశివ రావు, కోర్టు లైజనింగ్ కె.శ్రీకాంత్ (SI)) హోంగార్డ్ ఆఫీసర్ ఎండీ.ఆయూబ్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.
Also Read: Bhoobharati Act: గుట్టలుగా భూభారతి దరఖాస్తులు.. గడువు దగ్గర పరిష్కారం దూరం
