Karimnagar Man Suicide: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఒక యువకుడి ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. రామంచ గ్రామానికి చెందిన నాగేల్లి వెంకటేష్ రెడ్డి అనే యువకుడు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చిన్న ముల్కనూర్ ప్రాంతంలో మహాదేవ్ సూపర్ మార్కెట్ నడిపిస్తున్న వెంకటేష్ రెడ్డికి రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. సెల్ఫీ వీడియోలో తన చావుకు తన కుటుంబ సభ్యులే కారణమని పేర్కొంటూ.. వెంకటేష్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నాడు.
తల్లిదండ్రులు ఏం చేశారంటే?
సెల్ఫీ వీడియోలో మాట్లాడిన వెంకటేష్ రెడ్డి.. తన తల్లితండ్రుల వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. సెల్ఫీ వీడియో ప్రకారం.. వెంకటేష్ తల్లిదండ్రులు, అన్నదమ్ములతో కలిసి సూపర్ మార్కెట్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అందులో రూ.10 లక్షల వరకూ పెట్టుబడి సైతం పెట్టాడు. అయితే వ్యాపార విషయంలో కుటుంబ సభ్యులతో వివాదం తలెత్తినట్లు వెంకటేష్ తెలిపాడు. నువ్వు రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే.. మేము రూ.17 లక్షలు పెట్టుబడి పెట్టామంటూ తల్లిదండ్రులు, అన్నదమ్ములే ఎదురుదాడికి దిగినట్లు ఆరోపించారు.
‘మాటలు పడాలని లేదు’
తాము పెట్టుబడిగా పెట్టిన డబ్బులు మెుత్తం ఇచ్చి దుకాణంలో కూర్చోవాలని కుటుంబ సభ్యులు వేధించినట్లు వెంకటేష్ రెడ్డి వాపోయాడు. అప్పటికే రూ.4 లక్షలు చెల్లించానని.. మరో ఏడాది సమయం ఇస్తే పూర్తిగా చెల్లిస్తానని చెప్పినా వారు వినిపించుకోలేదన్నారు. వ్యాపారంలో తన ప్రమేయం లేకుండా అణిచివేసే ప్రయత్నం చేశారన్నారు. తన డబ్బు తిరిగి రాకున్నా తనకు ఇష్టమేనని.. పదే పదే అయినవారి చేత మాటాలు పడాలని తనకు లేదని వీడియోలో చెప్పుకొచ్చాడు.
Also Read: Janasena MLA Viral Video: జనసేన ఎమ్మెల్యే రాసలీలలు.. సంచలన వీడియో పోస్ట్ చేసిన వైసీపీ
భార్యకు క్షమాపణలు..
తనను నమ్ముకొని పెళ్లి చేసుకున్న భార్యకు ఈ సందర్భంగా వెంకటేష్ రెడ్డి క్షమాపణలు చెప్పాడు. ఆమెకు అన్యాయం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెకు రూ.10 లక్షలు ఇప్పించి.. పుట్టింటిలో విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. అత్తింటివారికి సైతం క్షమాపణలు చెబుతూ.. తన భార్యకు మంచి భవిష్యత్తులో ఉండేలా చూసుకోవాలని వేడుకున్నారు. మరోవైపు తన అంత్యక్రియలు తన కుటుంబాన్ని దూరంగా ఉంచాలని.. వారి డబ్బుతో దహన సంస్కారాలు చేయవద్దన్నారు. అంతేకాకుండా అజయ్ రెడ్డి అనే స్నేహితుడి చేతితో తన చితికి నిప్పు పెట్టించాలని ఆఖరి కోరికగా వెల్లబుచ్చాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
నా చావుకు మా అమ్మ, నాన్నే కారణం.. కొడుకు సెల్ఫీ సూసైడ్
తన స్నేహితుడి చేత చితికి నిప్పుపెట్టించాలని అభ్యర్థన
కరీంనగర్ జిల్లా రామంచ గ్రామంలో విషాదం
నాగేల్లి వెంకటేష్ రెడ్డి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య
కంటతడి పెట్టిస్తున్న సెల్ఫీ వీడియోరెండు నెలల క్రితమే వివాహం చేసుకున్న… pic.twitter.com/pt8Q1xkinS
— BIG TV Breaking News (@bigtvtelugu) January 27, 2026

