Janasena MLA Viral Video: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎమ్మెల్యేల వ్యవహార శైలి వివాదస్పదంగా మారుతున్నాయి. తాజాగా జనసేన ఎమ్మెల్యే రాసలీలలకు సంబంధించిన వీడియో బయటకొచ్చింది. విపక్ష వైసీపీ పార్టీ (YSRCP) స్వయంగా ఈ వీడియోను ఎక్స్ వేదికగా బయటపెట్టింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీధర్ కీచకపర్వమంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఫేస్ బుక్ పరిచయాన్ని ఆసరాగా చేసుకొని.. మహిళా ఉద్యోగినిని ఎమ్మెల్యే వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది.
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన వీడియో కాల్, వాట్సప్ చాట్‌ను వైసీపీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగిని భయపెట్టి ఏడాదిన్నరగా MLA అత్యాచారం చేశారంటూ ఆరోపించింది. కోరిక తీర్చకుంటే మహిళ మూడేళ్ల కొడుకును చంపేస్తానంటూ MLA బెదిరించారని వైసీపీ అంటోంది. భర్తకు విడాకులు ఇవ్వాలని మహిళను బెదిరించడమే కాకుండా.. ఆమె భర్తకు కూడా ఫోన్ చేసి బెదిరించారంటూ వైసీపీ ఆరోపించింది.
Janasena ❌ | Kamasena ✅
రైల్వే కోడూరు @JanaSenaParty ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్, అరవ శ్రీధర్ కీచకపర్వం…🚨
-ఫేస్బుక్ పరిచయాన్ని ఆసరా చేసుకుని మహిళా ఉద్యోగిణిపై వేధింపుల పర్వం
-ప్రభుత్వ ఉద్యోగిణిని భయపెట్టి ఏడాదిన్నరగా అత్యాచారం చేసిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్
-తల్లిదండ్రులు… pic.twitter.com/YBfk5w9lnA— YSR Congress Party (@YSRCParty) January 27, 2026
Also Read: India – EU Free Trade Deal: భారత్ – ఈయూ వాణిజ్య ఒప్పందం.. భారీగా తగ్గనున్న ధరలు.. వస్తువుల లిస్ట్ ఇదే!
తాను ఎమ్మెల్యేనని.. ఏమైనా చేయగలనని అరవ శ్రీధర్ వేధించినట్లు వైసీపీ ఎక్స్ లో రాసుకొచ్చింది. ఎమ్మెల్యే కారణంగా సదరు ఉద్యోగిని.. గర్భవతి కూడా అయ్యిందని.. ఆమెను బెదిరించి అబార్షన్ చేయించారని వైసీపీ ఆరోపణలు చేసింది. ఇదేనా మహిళలకు కల్పించే రక్షణ? బాధితులకు ఏం న్యాయం చేస్తారు? అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ లకు వైసీపీ ట్యాగ్ చేసింది.

