Cyber ​​Crime (imagecredit:canva)
క్రైమ్

Cyber ​​Crime: సైబర్ కిలాడీ అరెస్ట్.. ఎలా అరెస్ట్ చేశారంటే?

కరీంనగర్​ స్వేచ్ఛ: Cyber ​​Crime: ఇన్వెస్ట్మెంట్  పేరుతో డబ్బులు దోచుకున్న సైబర్ నేరస్తుడిని  కరీంనగర్ సైబర్ క్రైమ్  పోలీస్ స్టేషన్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ పట్టణంలో నివసిస్తున్నటువంటి బాధితుడికి సోషల్ మీడియా  ప్లాట్ పాం అయిన ఇన్​స్టాగ్రామ్ లో ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించి  ప్రకటన చూసి జూలై 2024 నుంచి ఇన్వెస్ట్​మెంట్​ పెట్టడం ప్రారంభించాడు.

మొదటగా పెట్టిన వెయ్యి రూపాయలకు రెండు వేల రూపాయల వరకు లాభం రావడం జరిగింది. బాధితుడు సైబర్ నేరగాళ్లు మొదట పంపించినట్లు లాభాన్ని  మరియు వారి యొక్క మాటలను నమ్మి వారు చెప్పిన బ్యాంక్ అకౌంట్లో ఏడు దఫాలుగా లోన్ సైతం తీసుకొని దాదాపు రూ. 40 లక్షల 90 వేల రూపాయల వరకు ఇన్వెస్ట్​మెంట్​ పెట్టాడు.

Also Rad: Telangana Police: అయ్యబాబోయ్.. 70వేల మొబైల్​ ఫోన్ల రికవరీ.. ఎలా చేశారంటే?

నేరస్తులకు డబ్బులు పంపించే సమయంలో మోసం చేస్తున్నారని గుర్తించలేకపోయానని, ఆ తర్వాత  తాను మోసపోయానని గుర్తించి గతేడాది ఆగస్టు నెలలో  సైబర్ క్రైమ్ హెల్ప్​ లైన్​ సెంటర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ కు పిటిషన్ రాగానే కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్ ఎచ్​ ఓ గా విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ నర్సింహా రెడ్డి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు.

కేసు విచారించే సమయంలో నేరస్తులు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలో డబ్బులను ట్రాన్స్ ఫర్​ చేశారని గుర్తించారు.  సైబర్ క్రైమ్ డీఎస్పీ నరసింహారెడ్డి తన యొక్క  సిబ్బందితో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాకు చెందిన నితిన్ దేవచంద్ భాయ్ గజేరాని అదుపులోకి తీసుకున్నారు.

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లా కోర్టు అనుమతితో అక్కడి నుంచి  ట్రాన్సిస్ట్ వారెంట్​ పై శనివారం కరీంనగర్ కోర్టులో హాజరు పరిచి నిందితున్ని రిమాండ్ కు తరలించినట్లు కరీంనగర్​ సైబర్​ క్రైం పోలీసులు తెలిపారు.

Also Read: Crime : మెహందీ ఆర్టిస్ట్ ఆత్మహత్య

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ