Telangana Police [ image credit: Ai]
తెలంగాణ

Telangana Police: అయ్యబాబోయ్.. 70వేల మొబైల్​ ఫోన్ల రికవరీ.. ఎలా చేశారంటే?

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Telangana Police: పోగొట్టుకున్నచోరీ అయిన మొబైల్​ ఫోన్లను రికవరీ చేయటంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే టాప్​ 2లో నిలిచారు. రోజుకు సగటున 99 సెల్​ ఫోన్లను రికవరీ చేస్తూ సరిలేరు మాకెవ్వరు అని నిరూపించుకుంటున్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రాష్ట్రంలో  మొత్తం మీద ఉన్న 780 పోలీస్​ స్టేషన్ల పరిధుల్లో చోరీ అయిన, పోగొట్టుకున్న 70వేల 58 మొబైల్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా సిబ్బంది అంకిత భావంతో పని చేయటం వల్లనే సాధ్యమైందని సీఐడీ డీజీ శిఖా గోయల్​ చెప్పారు.

అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్​ పరిధిలో 10,861, సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో 9,259, రాచకొండ కమిషనరేట్​ పరిధిలో 7,488 ఫోన్లను రికవరీ చేసినట్టు తెలిపారు. ప్రతీరోజూ రాష్ట్రంలోని  వేర్వేరు పోలీస్​ స్టేషన్ల పరిధుల్లో మొబైల్​ ఫోన్లను పోగొట్టుకుంటున్న జనం పోలీస్​ స్టేషన్లలో ఇస్తున్న ఫిర్యాదులు వేల సంఖ్యలో ఉంటున్నాయి. అదే సమయంలో పిక్​ పాకెటింగ్​ గ్యాంగులు రద్దీగా ఉండే బస్సులు, రైళ్లలో తిరుగుతూ మార్కెట్లలో సంచరిస్తూ వందల సంఖ్యలో సెల్​ ఫోన్లను కొట్టేస్తున్నారు.

 Also Read: Fine Rice Distribution: ఉగాది నాడు గుడ్ న్యూస్.. సన్న బియ్యం పంపిణీ ప్రారంభం.. సీఎం రేవంత్ రెడ్డి

గతంలో ఇలా పోగొట్టుకున్న…చోరీ అయిన ఫోన్లను రికవరీ చేయటం సాధ్యమయ్యేది కాదు. అయితే, సెంట్రల్​ ఎక్విప్​ మెంట్​ ఐడెంటిటీ రిజిష్టర్​ (సీఈఐఆర్​) సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకు రావటం ద్వారా దీనికి పోలీసు ఉన్నతాధికారులు చెక్​ పెట్టారు. ఎవరైనా ఫోన్​ పోయిందనో…చోరీ అయ్యిందనో ఫిర్యాదు ఇస్తే ఆ ఫోన్​ కు సంబంధించిన ఐఎంఈ నెంబర్​ తీసుకుని సీఈఐఆర్​ పోర్టల్​ లో అప్​ లోడ్​ చేస్తున్నారు. ఫోన్​ దొరికినవారు లేదా దొంగిలించిన వారు దాంట్లోని సిమ్​ కార్డును మార్చి వేరే సిమ్​ కార్డు వేసి ఆన్​ చేయగానే ఆ వివరాలు సీఈఐ‌‌ఆర్​ పోర్టల్​ ద్వారా పోలీసులకు అందుతున్నాయి.వెంటనే పోలీసులు మార్చిన నెంబర్​ కు ఫోన్లు చేసి మొబైల్​ ఫోన్లను వెనక్కి తెప్పిస్తున్నారు.

 Also Read: MP Chamala Kiran Kumar: పార్లమెంటులో గొంతు నొక్కేస్తున్నారు’.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్

ఇదంతా సిబ్బంది తమ తమ విధులను అంకిత భావంతో నిర్వర్తిస్తుండటం వల్లనే సాధ్యమవుతోందని సీఐడీ డీజీ శిఖా గోయల్​ అన్నారు. టెలీకాం డిపార్ట్​ మెంట్​ తో సమన్వయం చేసుకుని అందుబాటులోకి తీసుకొచ్చిన సీఈఐఆర్​ సాంకేతిక పరిజ్ఞానం సత్ఫలితాలు ఇస్తోందన్నారు. ఎవరైనా మొబైల్​ ఫోన్ ను పోగొట్టుకున్నా…ఎవరిదైనా సెల్​ ఫోన్ చోరీ అయినా వెంటనే ఐఎంఈ నెంబర్​ తోపాటు అన్ని వివరాలను పేర్కొంటూ www.tspolice.gov.in లేదా www.ceir.gov.in వెబ్​ సైట్లలో అప్​ లోడ్​ చేయాలన్నారు. మొబైల్​ ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ టాప్​ 2లో నిలబడటంలో విశేషంగా కృషి చేస్తున్న ఎస్పీ బీ.గంగారాం, ఐటీ సెల్​ సిబ్బందితోపాటు డీడీజీ (సెక్యూరిటీ) హేమంత్​ రత్వే, డైరెక్టర్​ సెక్యూరిటీ అరవింద్​ కుమార్​, జేటీవో సెక్యూరిటీ నంబి మృదుపాణిలను ఆమె అభినందించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

 

 

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?