Nigerian's Arrested: అంతరాష్ట్ర డ్రగ్స్ దందా.. నైజీరియన్లు అరెస్ట్
Nigerian's Arrested (imagcredit:twitter)
క్రైమ్

Nigerian’s Arrested: అంతరాష్ట్ర డ్రగ్స్ దందా.. ఇద్దరు నైజీరియన్లు అరెస్ట్

Nigerian’s Arrested: అందరూ డ్రగ్స్ దందా చేసేవారే ఈ క్రమంలో పట్టుబడి జైలు పాలయ్యారు. అక్కడ ఒకరికొకరు పరిచయం అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత కలిసి డ్రగ్స్ దందా చేస్తూ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులకు దొరికిపోయారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒకోరో కాస్మోస్ రాంసేయ్ అలియాస్ ఆండీ, రోలాండ్లు నైజీరియా దేశస్తులు. వేర్వేరు వీసాలపై మన దేశానికి వచ్చిన ఈ ఇద్దరు చాలాకాలంగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు.

అందరినీ ఒకే బ్యారక్‌లో ఉంచటం

ఇక, లక్ష్మీపతి, భారత్ కల్యాణి, అబ్దుల్ జాఫర్ ఖాన్ లోకల్ గా మాదక ద్రవ్యాల దందా చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడి చెంచల్ గూడ జైలు పాలయ్యారు. అందరినీ ఒకే బ్యారక్ లో ఉంచటంతో వీరి మధ్య స్నేహం కుదిరింది. ఈ క్రమంలో ఒకరి ఫోన్ నెంబర్లు మరొకరు తీసుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాంసేయ్, రోలాండ్ లు గోల్కొండ వినాయక్ నగర్లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ముంబయికి చెందిన జేమ్స్ నుంచి కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ కొనితెస్తూ లక్ష్మీపతి తదితరులకు అమ్ముతున్నారు.

Also Read: Priya Naidu: పని ఇవ్వని వాడే ఎక్కడ పడితే అక్కడ చేతులేసి నొక్కుతాడు

 యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు

లక్ష్మీపతి కూడా గోవాకు చెందిన జాక్, రోమీ భరత్, అబ్దుల్ జాఫర్ ల నుంచి డ్రగ్స్ కొని తెచ్చి అమ్ముతున్నారు. వీరి గురించి పక్కాగా సమాచారం సేకరించిన యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడులు చేసి అయిదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 20 గ్రాముల కొకైన్, 45 గ్రాముల ఎండీఎంఏ, 20 గ్రాముల ఎక్టసీ పిల్స్, 40 వేల నగదు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Minister Sridhar Babu: తెలంగాణ అన్ స్టాపబుల్.. వేరే రాష్ట్రాలకు రోల్ మోడల్

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క