Priya Naidu
ఎంటర్‌టైన్మెంట్

Priya Naidu: పని ఇవ్వని వాడే ఎక్కడ పడితే అక్కడ చేతులేసి నొక్కుతాడు

Priya Naidu: మల్టీ టాలెంటెడ్ పర్సన్ రవిబాబుపై ఇండస్ట్రీలో ఎలాంటి రూమర్స్ ఉన్నాయో తెలియంది కాదు. అవన్నీ రూమర్సే అంటుంది నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ప్రియా నాయుడు. తాజాగా ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రవిబాబు గురించి, అలాగే ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ రూల్ గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు (Mohan Babu)లా రవిబాబు (Ravi Babu) కూడా కోపిష్టి అంట, టైమ్‌కి లొకేషన్‌కి వెళ్లకపోతే తిడతారంట… అది, ఇది అని రవిబాబు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.. కానీ ఆయన చాలా స్వీట్ పర్సన్. ఆయన చాలా ఓపికగా పని నేర్పుతాడు. మరి ఎందుకు ఆయనపై ఇలాంటి రూమర్స్ స్ర్పెడ్ చేస్తున్నారో నాకయితే అర్థం కాదని అంటోంది ప్రియా నాయుడు.

Also Read- Dil Raju: 14 సంవత్సరాల తర్వాత.. 14వ తేదీన.. మోత మోగిపోవాలి

‘‘పని ఇచ్చేవాడు ఎవడూ ఆపర్లు అడగడు. కమిట్‌మెంట్ అడగడం వల్లే.. నేను సినిమాలు చేయడం లేదు. పని ఇచ్చేవాడా? లేదంటే ఎలాంటి వాడనేది? ఈజీగా తెలిసిపోతుంది. 10 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఆ మాత్రం తెలియదా? హాట్‌గా ఉన్నావు, స్వీట్‌గా ఉన్నావు అంటుంటారు. హాట్‌గా ఉండటానికి నేనేమైనా కారం పూసుకున్నానా? అలాంటి మాటలు విన్నప్పుడే అర్థమైపోతుంది. ఇప్పటి వరకు నేను ఎవరికీ కమిట్‌మెంట్ ఇవ్వలేదు.. ఇవ్వను కూడా. ఇచ్చానని ఎవరైనా నిరూపిస్తే.. ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతా. ఆ కమిట్‌మెంట్ (commitment issues) ఇవ్వనందువల్లే నాకు వచ్చిన అవకాశాలు చాలా వరకు వదిలేసుకోవాల్సి వచ్చింది. నాకు అవతలి వాడి మనసులో ఏముందో అర్థమైపోతుంది.

నేనిప్పుడు రవిబాబుతో ఓ సినిమా చేశాను. ఆయన ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్. కొట్టి మరీ వర్క్ చేయిస్తాడు. పని ఇచ్చేవాడు అట్లా ఉంటాడు. పని ఇవ్వని వాడే ఎక్కడ పడితే అక్కడ చేతులేసి నొక్కుతాడు. రవిబాబుతో ‘ఏనుగు తొండం ఘట్కేసర్’ అనే సినిమా చేశాను. శ్రీకాంత్ అయ్యంగార్ గాళ్‌ ఫ్రెండ్‌గా అందులో కనిపిస్తాను. ఒక సీన్ సరిగ్గా రాలేదు.. దీంతో ఆయనని చూసి భయపడిపోతున్నాను. అంటే, కెమెరాకు క్రాస్‌గా నడవమంటున్నారు. ఆయనని చూస్తుంటేనేమో నాకు భయం వేస్తుంది. టు, త్రీ,.. ఫైవ్, సిక్స్ టేక్స్ తీసుకునే సరికి.. సెవెన్త్ టేక్‌కి నాకు కాళ్లు గజగజ వణికిపోతున్నాయి. అందరిలో పట్టుకుని తిట్టేస్తారు. ఆయన ఏంటంటే.. కెమెరామ్యాన్‌గా చేస్తారు, డైరెక్షన్ చూసుకుంటారు, కాస్ట్యూమ్స్ చూసుకుంటారు… మొత్తం ఆల్ సెట్ అంతా ఆయన మ్యానేజ్ చేస్తారు. అంత హార్డ్ వర్కర్ రవిబాబు. సో.. ఆయన నాకు వర్క్ ఇచ్చారు. ఆయనెప్పుడూ నన్ను ఏమీ అనలేదు. పని ఇచ్చేవాడు ఎవడూ ఆఫర్ అడగడు..’’ అని ప్రియా నాయుడు చెప్పుకొచ్చింది.

Also Read- King Nagarjuna: ‘కూలీ’లో నా పాత్రకి విజిల్స్ పడతాయి.. నేనే ఆశ్చర్యపోయా!

ప్రియా నాయుడు విషయానికి వస్తే.. ఇటీవల వచ్చిన ‘మ్యాడ్ 2’ సినిమాలో ఆమె నటించిన విషయం తెలిసిందే. దాదాపు 10 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఆమె.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపునే పొందారు. ‘సైరా, వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ’ వంటి చిత్రాలెన్నింటిలోనే ఆమె నటించారు. ప్రస్తుతం మంచి మంచి అవకాశాలు తనకు వస్తున్నాయిని ఈ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు