King Nagarjuna and Lokesh Kanagaraj
ఎంటర్‌టైన్మెంట్

King Nagarjuna: ‘కూలీ’లో నా పాత్రకి విజిల్స్ పడతాయి.. నేనే ఆశ్చర్యపోయా!

King Nagarjuna: కింగ్ నాగార్జునకు సోలో‌గా హిట్ పడి చాలా కాలం అవుతుంది. సినిమాలైతే చేస్తున్నాడు కానీ, హిట్ మాత్రం ఆయనకు రావడం లేదు. ఈ నేపథ్యంలో కింగ్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. బాలీవుడ్ ‘బ్రహ్మాస్త్ర’లో ఓ కీలక పాత్రలో నటించిన నాగార్జున.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా నటిస్తున్న ‘కుబేర’ (Kubera) సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా కింగ్ నాగార్జున ‘కుబేర’ సినిమాతో పాటు.. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ‘కూలీ’ (Coolie) సినిమాలో చేస్తున్న పాత్ర గురించి కూడా వివరించారు. ముఖ్యంగా ‘కూలీ’ సినిమాలోని తన పాత్ర.. తననే ఆశ్చర్యపరిచిందని నాగ్ చెప్పడంతో.. ఆ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

Also Read- Allu Aravind: ఫేక్ ఐడీతో అమ్మాయిల్ని ఫాలో అవుతుంటా.. అసలు విషయం అదన్నమాట!

లోకేష్ కనగరాజ్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తే.. ఆ హీరో ఫ్యాన్స్‌కి హై ఇచ్చేస్తాడు. ‘విక్రమ్’తో కమల్ హాసన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన లోకేష్.. ఇప్పుడు రజినీకాంత్ ఫ్యాన్స్‌ కోసం ఫుల్ ట్రీట్ రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రని డిజైన్ చేసిన తీరు చూసి.. నేనే ఆశ్చర్యపోయానని, నేను కనిపించిన ప్రతిసారి విజిల్స్ పడతాయని కింగ్ నాగ్ చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముందుగా ‘కుబేర’ గురించి నాగార్జున మాట్లాడుతూ.. నాకే కాదు, తెలుగు ప్రేక్షకులంతా ఇష్టపడే దర్శకుల్లో శేఖర్‌ కమ్ముల ఒకరు. ఆయన తీసిన చిత్రాలన్నీ చూశాను. ఆయన కథలను ఎన్నుకునే విధానం నాకు చాలా నచ్చుతుంది. రొటీన్‌ జానర్‌ కాకుండా.. ఒక ప్రత్యేకమైన జానర్‌లో ఆయన సినిమాలు చేస్తుంటారు. ‘కుబేర’ కథతో నా వద్దకు వచ్చినప్పుడు.. శేఖర్‌..నిజంగానే ఈ సినిమా చేయాలనుకుంటున్నావా? అని ప్రశ్నించాను. ఎందుకంటే ఇది చాలా విభిన్నమైన చిత్రం. ప్రేక్షకులను ఆలోచింపజేసే నిజాలు ఇందులో ఉన్నాయి. ఇందులోని కొన్ని విషయాలు విని నేనే షాక్ అయ్యాను. ఈ సినిమా కోసం ఆయన ఎంతో రీసెర్చ్‌ చేశారు. ఒక స్కామ్‌నో, లేదంటే ఏ ఒక్కరినో ఆధారంగా చేసుకొని ఆయన ఈ కథ రాయలేదు. ప్రస్తుత సమాజంలో చూస్తున్న అంశాలనే ఇందులో చెప్పారు. న్యాయంపై ఆయనకు చాలా బలమైన నమ్మకం ఉంది. పేద, మధ్యతరగతి, ధనిక కుటుంబాల్లో ఏం జరుగుతుందనేది ఇందులో చూపించారు. ఎంత అందంగా కథను రాసుకున్నారో.. అంతే అందంగా తెరకెక్కించారు. సినిమా విడుదల తర్వాత శేఖర్‌కు చాలా మంచి పేరు వస్తుందని చెప్పుకొచ్చారు.

Also Read- DD Next Level: ఓటీటీలోకి వచ్చేస్తున్న దడ పుట్టించే కామెడీ సినిమా.. ఎందులో అంటే?

ఇక ‘కూలీ’ గురించి మాట్లాడుతూ.. లోకేశ్‌ కనగరాజ్‌ రూపొందించిన ‘విక్రమ్’ నా ఫేవరెట్ ఫిల్మ్. ఆయనొక విజిల్‌ ఫ్యాక్టర్‌. చెన్నై వెళ్లినప్పుడు ఆయనకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూశా. ‘కూలీ’లో నా పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. నన్ను స్క్రీన్‌పై చూపించిన తీరుకు నేనే ఆశ్చర్యపోయా. అందుకు లోకేశ్‌కు థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్‌ టైమ్‌ విజువల్‌ చూసినప్పుడు నిజంగా అది నేనేనా? అనిపించింది. నేను కనిపించే ప్రతి సన్నివేశంలో విజిల్స్ పడతాయి. ఇది పూర్తిస్థాయి విజిల్‌ మూవీ. లోకేశ్‌ సినిమాల్లో పాత్రలు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలోని ప్రతీ పాత్ర గుర్తుండిపోతుంది. అదే ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్‌ అని.. లోకేష్ కనగరాజ్‌పై కింగ్ ప్రశంసలు కురిపించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!